Kane Williamson: ఒక్క ఓటమితో తక్కువ చేయవద్దు.. భారత్ చాలా బలమైనది.. మా విజయానికి కారణం అదే!

Kane Williamson: Team India is a formidable and truly great side | Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓడినప్పటికీ భారత్ బలమైన జట్టేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఒక్క మ్యాచ్ ఫలితంతో ఓ జట్టు స్థాయిని అంచనా వేయకూడదన్నాడు. మెగా ఫైనల్లో విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్.. 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియా టుడేతో మాట్లాడిన విలియమ్సన్‌ టీమిండియాను కొనియాడాడు. ఫైనల్ మ్యాచ్‌ ఒక్కటే ఉండటం ఎంతో ఉత్సాహం కలిగిస్తుందని, కానీ.. భారత జట్టు ఎంత బలమైనదో చెప్పడానికి ఆ ఒక్క మ్యాచ్‌ సరిపోదన్నాడు.

 ఆసక్తిని పెంచడానికే ఫైనల్స్..

ఆసక్తిని పెంచడానికే ఫైనల్స్..

'స్పోర్ట్స్‌లో టోర్నమెంట్లు, ఫైనల్స్ సహజం. ఆసక్తిని పెంచడం కోసం ఆ పద్దతి ఉంటుంది. కానీ ఒక్క మ్యాచ్ ఫలితంతో జట్టు స్థాయిని జడ్జ్ చేయలేం. భారత్ ఎంత బలమైన జట్టో అందరికీ తెలుసు. ఫైనల్లో మేము గెలిచినందుకు సంతోషంగా ఉన్నా. కానీ టీమిండియా క్వాలిటీ మాత్రం అలాగే ఉంది. పైగా బలమైన జట్టుగా ఎదుగుతూనే ఉంది. నా దృష్టిలో భారత ప్లేయర్లు క్రికెట్‌కు అంబాసిడర్లు. అలాంటి జట్టుపై విజయం సాధించడం మాకు గర్వంగా ఉంది. వాళ్లకున్న పేస్‌ బౌలింగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైంది. అలాగే స్పిన్‌ బౌలర్లు కూడా అత్యద్భుతంగా బంతులేస్తారు. ఇక బ్యాటింగ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. బ్యాకప్‌ ఆటగాళ్లను కూడా అద్భుతంగా తయారు చేసుకున్నారు.'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

 ఆ ఇద్దరు ఔటవ్వడం..

ఆ ఇద్దరు ఔటవ్వడం..

ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆఖరి రోజు ఆటలో కోహ్లీ, పుజార వికెట్లు త్వరగా సాధించడం తమకు కలిసొచ్చిందని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.‘చివరి రోజు ఫలితం అటు ఇటుగా మూడు విధాలుగా ఉంటుందనుకున్నారు. సమయాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రాగా ముగుస్తుందని కూడా అంచనా వేసారు. కానీ ఆరో రోజు(రిజర్వ్‌డే) ఫలితం ఎలా అయినా ఉండొచ్చని మేం ముందే ఊహించాం. అయితే, శక్తిమేరకు పోరాడాలని నిర్ణయించుకున్నాం. కాగా, ఈ మ్యాచ్‌ ద్వారా పరిస్థితులు ఎలా మారుతాయో తెలిసొచ్చింది. ఆఖరి రోజు ఆటలో కోహ్లీ, పుజార వికెట్లు త్వరగా సాధించడం మాకు కలిసొచ్చింది.'అని విలియమ్సన్ పేర్కొన్నాడు.

కైల్ జెమీసన్ వల్లే..

కైల్ జెమీసన్ వల్లే..

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏడు వికెట్లతో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించిన కైల్ జెమీసన్‌పై విలియమ్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇరు జట్లలో ఉన్న తేడా అతనేనని, అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు.‘కైల్ జెమీసన్ ఓ అద్భుతమైన ప్లేయర్. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు కొత్త అయినా అద్భుతంగా రాణించాడు. బ్యాట్, బంతితో మెరిసి మా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో అతను అద్భుతమైన స్పెల్స్ వేసాడు. ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.'అని విలియమ్సన్ కొనియాడాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీని జెమీసన్ ఔట్ చేసిన విషయం తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 29, 2021, 9:04 [IST]
Other articles published on Jun 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X