విలియమ్సన్ రికార్డు సెంచరీ నమోదు

హైదరాబాద్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రికెట్ చరిత్రలోనే అరుదైనదిగా అతని కెరీర్ లోనే అత్యుత్తమమైన రికార్డు సృష్టించాడు. దీంతో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన కివీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న డే-నైట్ టెస్టులో శుక్రవారం ఈ రికార్డును లిఖించాడు. టెస్టు కెరీర్‌లో 18వ శతకాన్ని నమోదు చేశాడు. 220 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 102 పరుగులు చేసి అవుటయ్యాడు.
తాజా శతకంతో మార్టిన్ క్రోవ్, రాస్ టేలర్‌ను విలియమ్సన్ అధిగమించాడు. వీరిద్దరూ 17 టెస్టు సెంచరీలు చేశారు. క్రోవ్, టేలర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం. 114 ఇన్నింగ్స్‌లోనే 18వ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. క్రోవ్ 120 ఇన్నింగ్స్‌లో 17 సెంచరీలు చేయగా, టేలర్ 149 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.
64వ టెస్ట్ ఆడుతున్న విలియమ్సన్ ఇప్పటివరకు 114 ఇన్నింగ్స్ ఆడి 5316 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి. 28 ఏళ్ల విలియమ్సన్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2015 జనవరిలో శ్రీలంక జట్టుతో ఆడి కెరీర్‌లోనే విలియమ్సన్ అత్యధిక స్కోరు 242గా నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ శ్రీలంకలోని బేసిన్ రిజర్వ్ ప్రాంతంలో జరిగింది. వచ్చే ఆగష్టుకు విలియమ్సన్‌కు 28ఏళ్లు నిండుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications