Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ మామ మాస్ ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించాడు!

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పరుగుల వరద పారిస్తున్నాడు. గాయాలతో జట్టుకు దూరమవ్వడం, తిరిగి రావడం.. ఇలా గత కొంతకాలంగా జరుగుతున్నా ఫామ్‌ను మాత్రం కేన్ మామ కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో విలియమ్సన్ విశ్వరూపం చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు (289 బంతుల్లో) చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు.

రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా సెంచరీ సాధించడం విశేషం. 132 బంతుల్లో 109 పరుగులు చేశాడు. మరింత వేగంగా పరుగులు సాధించే ప్రయత్నంలో నీల్ బ్రాండ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అయితే సెంచరీల మోత మోగిస్తున్న విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన టెస్టు కెరీర్‌లో 31వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్న అతడు అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Kane Williamson Mass century Innings against South Africa 1st Test

సుదీర్ఘ ఫార్మాట్‌లో 31 సెంచరీలను వేగంగా అందుకున్న మూడో ప్లేయర్‌గా విలియమ్సన్ చరిత్రకెక్కాడు. టెస్టుల్లో 31 సెంచరీలను సచిన్ టెండూల్కర్ 165 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్, విలియమ్సన్ 170 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నారు. అంతేగాక కేన్ మామ మరో రికార్డు నమోదు చేశాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన అయిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

విలియమ్సన్ టెస్టుల్లో గత పది ఇన్నింగ్స్‌ల్లో అయిదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీలు చేయడం విశేషం. ఈ సెంచరీతో ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆరో ప్లేయర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి (80 సెంచరీలు), డేవిడ్ వార్నర్ (49), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) తర్వాత విలియమ్సన్ (44 శతకాలు) ఉన్నాడు. కాగా, మూడో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 179/4తో నిలిచింది. దక్షిణాఫ్రికాపై 528 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 511 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Tuesday, February 6, 2024, 11:50 [IST]
Other articles published on Feb 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+