For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హైదరాబాద్ కెప్టెన్ ప్రపంచంలోని టాప్ 5లో ఒకడు'

Kane Williamson is an all-round good player, says Mike Hesson

హైదరాబాద్: ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ జట్టు కెప్టెన్‌ను ప్రపంచవ్యాప్తంగా పొగడ్తలు ముంచెత్తుతున్నాయి. ఇటీవలే మీడియా సమావేశంలో పాల్గొన్న న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ విలియమ్సన్‌పై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ టాప్-5 అత్యుత్తమ ఆటగాళ్లలో అతను కూడా ఒకడని కితాబిచ్చాడు.

ఫీల్డర్లు లేని చోటుకే బంతిని:

ఫీల్డర్లు లేని చోటుకే బంతిని:

'ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం అత్యుత్తమ బ్యాట్స్‌మన్ లక్షణం. ఇందుకు విలియమ్సన్ మినహాయింపు కాదు. కేన్ చాలా తెలివైన ఆటగాడు. బంతి పడగానే బాదేయాలని చూడడు. ముందుగా సరైన పొజిషన్‌లోకి వచ్చి ఫీల్డర్లు లేని చోటుకే బంతిని తరలిస్తాడు. మంచి ఆల్‌రౌండర్. ప్రపంచస్థాయి ఆటగాళ్లలో కచ్చితంగా అతనికి స్థానం ఉంటుంది. కోహ్లీ, రూట్, స్మిత్ తర్వాతి స్థానంలో విలియమ్సన్ ఉంటాడు. భిన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో వీళ్లందరూ దిట్టలే' అని హెస్సన్ పేర్కొన్నాడు.

ఆడిన 11 మ్యాచ్‌ల్లో విలియమ్సన్ 493:

ఆడిన 11 మ్యాచ్‌ల్లో విలియమ్సన్ 493:

ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో విలియమ్సన్ 493 పరుగులు చేశాడు. శిఖర్‌ ధావన్‌, విలియమ్సన్‌ల సూపర్‌ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ అలవోకగా ఛేదించింది. హైదరాబాద్‌ తొమ్మిదో విజయంతో ఐపీఎల్‌-11లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఘనత సాధించింది.

లీగ్ ఆరంభం నుంచి బంతితో ఆకట్టుకున్న సన్‌రైజర్స్‌:

లీగ్ ఆరంభం నుంచి బంతితో ఆకట్టుకున్న సన్‌రైజర్స్‌:

లీగ్ ఆరంభం నుంచి బంతితో ఆకట్టుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి బ్యాటుతో మెరిసింది. ధావన్‌ (92), విలియమ్సన్‌ (83) రెచ్చిపోవడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘనవిజయం సాధించింది. రిషబ్‌ పంత్‌ (128) విధ్వంసక సెంచరీతో మొదట ఢిల్లీ 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ధావన్‌-విలియమ్సన్‌ అభేద్యమైన రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి అలవోకగా ఛేదించింది.

ధావన్‌, విలియమ్సన్‌ అలవోకగా బ్యాటింగ్‌ చేస్తూ:

ధావన్‌, విలియమ్సన్‌ అలవోకగా బ్యాటింగ్‌ చేస్తూ:

రెండో ఓవర్లోనే ఓపెనర్‌ హేల్స్‌ (14) వికెట్‌ను కోల్పోయినా సన్‌రైజర్స్‌ ఛేదన ధాటిగా సాగింది. ధావన్‌, విలియమ్సన్‌ అలవోకగా బ్యాటింగ్‌ చేస్తూ జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి సాధించాల్సిన రన్‌రేట్‌ దాదాపు పదికి చేరినా కంగారుపడలేదు. మరింత ధాటిగా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ధావన్‌ 30 బంతుల్లో, విలియమ్సన్‌ 38 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్‌లో స్థానం దాదాపుగా ఖాయమైంది. కానీ ఈ విజయంతో అధికారికంగా ముందుకెళ్లింది.

Story first published: Friday, May 11, 2018, 9:27 [IST]
Other articles published on May 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+