సన్‌రైజర్స్ తొలి మ్యాచ్‌కి విలియమ్సన్ డౌటే!

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆ జట్టు ఆడే తొలి మ్యాచ్‌కు దూరమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ని ఆదివారం సాయంత్రం 4 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండకపోవచ్చని టీమ్ కోచ్ టామ్ మూడీ సందేహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మ్యాచ్‌కు ముందు ప్రకటిస్తాం
సన్‌రైజర్స్ ఆడే తొలి మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ ఆడేది లేనిది మ్యాచ్‌కు ముందు ప్రకటిస్తామని చెప్పారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ భుజానికి గాయమైంది. దీంతో శుక్రవారం రాత్రి మార్టిన్ గప్తిల్‌తో కలిసి నేరుగా కోల్‌కతా చేరుకున్న కేన్ విలియమ్సన్ ఆదివారం కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో ఆడేదానిపై స్పష్టత లేదు.

టామ్ మూడీ మాట్లాడుతూ
దీనిపై కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ "భుజం గాయం నుంచి విలియమ్సన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అదేం సుదీర్ఘ కాలం పాటు వేధించే గాయం కాదు. ఒకవేళ విలియమ్సన్ ఆడగలిగే స్థితిలో ఉంటే మ్యాచ్ సమయం వరకు తెలుస్తుంది. కొద్దిరోజుల్లోనే సొంత మైదానంలో సన్‌రైజర్స్ ఆడాల్సి ఉంటుంది. విలియమ్సన్ ఆడలేని పక్షంలో జట్టుకు ప్రస్తుతం జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు" అని అన్నాడు.

తర్వాతి మ్యాచ్ నుంచి ఆడతాడు
విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా తర్వాతి మ్యాచ్ నుంచి ఆడతాడని అందులో తమకెలాంటి సందేహం లేదని మూడీ స్పష్టం చేశాడు. మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇక, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ బెయిర్‌స్టోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తీసుకోవడంలో తమ ఉద్దేశం వేరే ఉందని టామ్ మూడీ చెప్పారు.

బెయిర్‌స్టోని ఎంపిక చేసుకోవడంపై
ఐపీఎల్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లని ఆడించే క్రమంలో అన్నింటికీ సరిపడే విధంగా తాము బెయిర్‌స్టోని ఎంపిక చేసుకున్నామని అన్నారు. బెయిర్ స్టో ప్రధాన ఆటగాడిగానే కాకుండా ఓపెనర్, వికెట్‌కీపర్‌గానూ అనేక రకాలుగా ఉపయోగపడతాడని తెలిపాడు. విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లోనూ బెయిర్ స్టో సరిగ్గా సరిపోతాడని మూడీ సన్‌రైజర్స్ నిర్ణయాన్ని వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications