For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs ENG: చరిత్ర సృష్టించిన కేన్ మామ

గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సత్తాచాటుతున్నాడు. స్వదేశంలో హాగ్లీ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 197 బంతుల్లో పది ఫోర్లతో 93 పరుగులు చేసిన కేన్ మామ.. రెండో ఇన్నింగ్స్‌‌లో 86 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఏడు బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు.

టెస్టుల్లో 9వేల పరుగులు సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 19వ బ్యాటర్ విలియమ్సన్. ఇక టెస్టుల పరంగా వేగంగా 9వేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో బ్యాటర్‌గా కుమార్ సంగక్కర్ (శ్రీలంక), యునిస్ ఖాన్ (పాకిస్థాన్) సరసన కేన్ మామ నిలిచాడు. 103వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విలియమ్సన్ కంటే ముందు స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా- 99 టెస్టులు), బ్రియాన్ లారా (వెస్టిండీస్ - 101 టెస్టులు) ఉన్నారు.

Kane Williamson Creates History as First New Zealand Batter to Achieve Unique Test Feat

ఇక ఫ్యాబ్-4లో టెస్టు పరుగుల్లో విరాట్ కోహ్లికి దగ్గరగా కేన్ విలియమ్సన్ వచ్చాడు. ఫ్యాబ్-4లో జో రూట్ (12754), స్టీవ్ స్మిత్ (9702), విరాట్ కోహ్లి (9145), కేన్ విలియమ్సన్ (9035) పరుగులు చేశారు. కాగా, మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 4 పరుగుల ఆధిక్యంలోనే నిలిచింది. ప్రధాన బ్యాటర్లలో డారిల్ మిచెల్ (31 బ్యాటింగ్; 99 బంతుల్లో, 6 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, బ్రిడన్ కార్స్ చెరో మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 348 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (93), గ్లెన్ ఫిలిప్స్ (58*) పరుగులు చేశారు. బ్రిడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 499 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (171), బెన్ స్టోక్స్ (80), ఒలీ పోప్ (77) పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ నాలుగు, నాథన్ స్మిత్ మూడు వికెట్లు తీశారు.

Story first published: Saturday, November 30, 2024, 12:30 [IST]
Other articles published on Nov 30, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+