Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: మళ్లీ టాప్‌లోకి కేన్‌ మామ.. కెరీర్‌ బెస్ట్‌కు జేమిసన్‌! అదే ర్యాంక్​లో కోహ్లీ!

Kane Williamson becomes the number 1 Test batsman in ICC Test Rankings, Virat Kohli at number 4

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో న్యూజీలాండ్ టీమ్‌కు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించిన కేన్‌.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్‌ను వెన‌క్కి నెట్టి నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ రెండు ఇన్నింగ్స్‌లో 49, 52 ప‌రుగులు చేసిన కేన్.. 901 పాయింట్ల‌తో అగ్రస్థానంలో నిలిచాడు. స్మిత్ 891 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉండగా.. 878 పాయింట్లతో మార్నస్‌ లబుషేన్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

బ్యాట్స్‌మ‌న్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 812 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆరో స్థానంలో ఉండగా.. వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ ఒకస్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న కివీస్‌ ఓపెనర్‌ డెవన్‌ కాన్వే.. ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మూడు స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు.

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్ అగ్ర స్థానంలో నిలిచాడు. కమిన్స్ ఖాతాలో 908 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (865 పాయింట్లు) రెండో స్థానంలో, కివీస్‌ పేసర్ టిమ్‌ సౌథీ (824 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఫైన‌ల్లో అద్భుతంగా రాణించిన కైల్ జేమీస‌న్ కెరీర్ బెస్ట్ 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు 7 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్ 2 స్థానాలు మెరుగుప‌ర‌చుకొని 11వ స్థానానికి వెళ్లాడు.

ఇక ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లో గ‌త‌వారం టాప్‌లో ఉన్న భారత ఆటగాడు ర‌వీంద్ర జ‌డేజా.. తాజా ర్యాంకుల్లో రెండో స్థానానికి ప‌డిపోయాడు. విండీస్ ప్లేయ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ మ‌ళ్లీ టాప్‌లోకి వెళ్లాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 123 రేటింగ్‌ పాయింట్లతో కివీస్ టాప్‌లో ఉంది. 121 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్తాన్ (94) టాప్‌-5లో ఉన్నాయి.

Story first published: Wednesday, June 30, 2021, 17:05 [IST]
Other articles published on Jun 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+