Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన కివీస్.. కేన్ మామకు విశ్రాంతి?

Kane Williamson and Tim Southee rested for India tour of Newzealand

భారత్‌తో తలపడే వన్డే జట్టును న్యూజిల్యాండ్ ప్రకటించింది. అంతకుముందు ఆ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడి నుంచి కొందరు కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతారు. వారితోపాటు న్యూజిల్యాండ్ కోచ్ స్టెడ్ బృందం కూడా స్వదేశం వెళ్లిపోతుందని సమాచారం. ఆ తర్వాత మిగతా జట్టు భారత్‌కు వస్తుంది. ఇక్కడ టీమిండియాతో వన్డే సిరీస్ ఆడుతుంది. దీనికోసం న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు రెండు వేరు వేరు బృందాలను ప్రకటించింది.
పాకిస్తాన్ సిరీస్ తర్వాత స్వదేశానికి..

పాకిస్తాన్ సిరీస్ తర్వాత స్వదేశానికి..

పాకిస్తాన్‌లో కివీస్ రెండు టెస్టులు ఆడుతుంది. ఇటీవలే టెస్టు కెప్టెన్సీకి స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌లో వెటరన్ పేసర్ టిమ్ సౌథీ ఆ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అనంతరం జరిగే వన్డే సిరీస్‌లో మళ్లీ విలియమ్సన్ చేతికి జట్టు పగ్గాలు అందుతాయి. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ తలపడుతుంది. అక్కడి నుంచి కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ తదితరులు స్వదేశం వెళ్లిపోతారు. మిగతా ఆటగాళ్లు వన్డే సిరీస్‌ కోసం భారత్‌ చేరుకుంటారు. ఈ సిరీస్‌లో న్యూజిల్యాండ్ జట్టుకు వెటరన్ బ్యాటర్ టామ్ లాథమ్ నాయకత్వం వహిస్తాడు.

భారత సిరీస్‌కు కొత్త వాళ్లు..

భారత సిరీస్‌కు కొత్త వాళ్లు..

కేవలం భారత్‌తో ఆడే సిరీస్‌కు మాత్రమే కొంత మంది కొత్త ముఖాలను న్యూజిల్యాండ్ ఎంపిక చేసింది. కివీ కోచ్ స్టెడ్ కూడా సౌథీ అండ్ కోతో కలిసి స్వదేశం వెళ్లిపోనున్నాడు. అక్కడ ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం ప్రణాళికలు చేయనున్నాడు. అతని గైర్హాజరీలో టామ్ లాథమ్ నేతృత్వంలోని జట్టుకు ల్యూక్ రోంచీ కోచ్‌గా వ్యవహరిస్తున్నట్లు న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత సిరీస్‌లో విలియమ్సన్, సౌథీల స్థానాలను మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ భర్తీ చేస్తున్నారు. న్యూజిల్యాండ్ దేశవాళీల్లో రాణించిన హెన్రీ షిప్లేకు పాకిస్తాన్, భారత్ రెండు జట్లతో జరిగే వన్డే సిరీసుల్లో చోటు దక్కింది.

భారత్, పాకిస్తాన్ వన్డే సిరీస్‌లకు న్యూజిల్యాండ్ జట్టు:

భారత్, పాకిస్తాన్ వన్డే సిరీస్‌లకు న్యూజిల్యాండ్ జట్టు:

కేన్ విలియమ్సన్ (పాకిస్తాన్ వన్డేలకు మాత్రమే) (కెప్టెన్), టామ్ లాథమ్ (భారత వన్డే సిరీస్‌కు మాత్రమే) (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్ (భారత సిరీస్‌కు మాత్రమే), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ (భారత సిరీస్‌కు మాత్రమే), లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారియల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ షిప్లే, ఐష్ సోధీ, టిమ్ సౌథీ (పాకిస్తాన్ వన్డేలకు మాత్రమే)

Story first published: Monday, December 19, 2022, 15:27 [IST]
Other articles published on Dec 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+