Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్టులో సరదా సంఘటన.. బౌండరీ దాటిన విలియమ్సన్‌ టోపీ (వీడియో)!!

Kane Williamson amusingly chases cap to boundary in windy Wellington
India vs New Zealand,1st Test : Kane Williamson Hilariously Chases Cap To The Boundary In Wellington

వెల్లింగ్టన్‌: క్రికెట్ ఆటలో కొన్నిసార్లు సరదా సంఘటనలు జరుగుతుంటాయి. సాధారణంగా బ్యాట్స్‌మన్‌ షాట్ ఆడితేనే బంతి బౌండరీ దాటుతుంది. ఒక్కోసారి ఫీల్డింగ్ తగ్గాప్పిదాల ద్వారా కూడా బౌండరీ చేరుకుంటుంది. కానీ.. హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో బ్యాట్స్‌మన్‌ టోపీ బౌండరీ దాటింది. అది గాలి కారణంగా. విషయంలోకి వెళితే....

బౌలర్‌తో ఏదో మాట్లాడుతుండగా

బౌలర్‌తో ఏదో మాట్లాడుతుండగా

న్యూజిలాండ్‌-భారత్‌ జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు శనివారం ముగిసింది. శనివారం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఆడుతోంది. 46వ ఓవర్‌ను కివీస్ పేసర్ టిమ్‌ సౌథీ వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో బేసిన్‌ రిజర్వ్‌లో తీవ్రమైన చల్లగాలులు వీచాయి. అదే సమయంలో కివీస్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ బౌలర్‌తో ఏదో మాట్లాడుతుండగా.. అతని టోపీ హఠాత్తుగా గాల్లోకి లేచింది. దానిని అందుకొంటుండగా అది ఇంకాస్త దూరం వెళ్లింది.

బౌండరీ దాటిన టోపీ

బౌండరీ దాటిన టోపీ

తీవ్రమైన గాలులతో టోపీ దూరంగా వెళుతుండడంతో.. విలియమ్సన్‌ దాన్ని వెంబడించాడు. అయితే టోపీ సైతం ఇంకా వేగంగా ముందుకు వెళ్ళింది. విలియమ్సన్‌ అందుకునేపోలే టోపీ కాస్త బౌండరీ లైన్‌ దాటేసింది. అప్పుడు కేన్ దాన్ని తీసుకుని తలపై పెట్టుకున్నాడు. కేన్ ఫీల్డింగ్‌ చేస్తున్న చోటు నుంచి దాదాపు 30 గజాలు పరిగెత్తి టోపీని తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన చూసి టిమ్‌ సౌథీ నవ్వుకున్నాడు.

మైదానంలో నవ్వులు

మైదానంలో నవ్వులు

విలియమ్సన్‌ టోపీని వెంబడించే సన్నివేశం చూసి మైదానంలో నవ్వులు విరిశాయి. వ్యాఖ్యాతలు, ప్రేక్షకులు చిరునవ్వులు చిందించారు. ఈ ఘటన మైదానంలోని కెమెరాకు చిక్కడంతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో పదేపదే రిపీట్ చేసారు. ప్రస్తుతం విలియమ్సన్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదుగా జరగడంతో వీడియో చూసిన వారు హాయిగా నవ్వుకుంటున్నారు.

39 పరుగుల వెనుకంజలో భారత్

మూడో రోజు ఆటముగిసే సరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అజింక్య రహానె (25), హనుమ విహారి (15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్‌ కన్నా భారత్‌ ఇంకా 39 పరుగుల వెనుకంజలో ఉంది. మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టును టీమిండియా గెలుచుకోవాలన్నా, కనీసం డ్రా చేయాలన్నా ఆ భారమంతా రహానె, విహారి బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది.

Story first published: Sunday, February 23, 2020, 17:14 [IST]
Other articles published on Feb 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+