న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేన్‌ రిచర్డ్‌సన్‌కు భారీ ఉపశమనం.. రిపోర్టులో కరోనా నెగిటివ్‌!!

Kane Richardson tests negative for COVID-19 test

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌కు ఉపశమనం లభించింది. రిచర్డ్‌సన్‌కు కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నెగిటివ్‌ అని తేలింది. గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు రిచర్డ్‌సన్‌కు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించింది. రిపోర్టులలో అతనికి కరోనా నెగిటివ్‌ అని తేలింది. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

<strong>కరోనా వైరస్ భయం.. కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఐసీసీ సమావేశం!!</strong>కరోనా వైరస్ భయం.. కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఐసీసీ సమావేశం!!

 రిచర్డ్‌సన్‌కు కరోనా నెగిటివ్‌

రిచర్డ్‌సన్‌కు కరోనా నెగిటివ్‌

'ఈ రోజు నిర్వహించిన పరీక్షలో పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌కు కరోనా వైరస్‌ నెగిటివ్‌ అని వచ్చింది. అతడు హోటల్‌ నుంచి సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వెళ్లడానికి అనుమతి లభించింది' అని సీఏ తెలిపింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి వచ్చిన రిచర్డ్‌సన్‌.. గొంతులో మంటగా ఉందని చెప్పడంతో ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. అతడిని జట్టు నుంచి ప్రత్యేకంగా ఉంచి పరీక్షలు నిర్వహించింది.

తొలి వన్డేకు దూరం

తొలి వన్డేకు దూరం

రిచర్డ్‌సన్‌కు గొంతు నొప్పి ఉడడంతో శుక్రవారం కివీస్‌తో జరిగిన తొలి వన్డేకు దూరమయ్యాడు. రిచర్డ్‌సన్‌కు బదులు సీన్‌ అబాట్‌ను సీఏ ఎంపిక చేసింది. ఇది సాధారణ గొంతు నొప్పి అని, కానీ.. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు రిచర్డ్‌సన్‌కు పరీక్షలు నిర్వహిస్తామని సీఏ ప్రతినిధి అంతకుముందే తెలిపారు. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించట్లేదు. ఇప్పటికే టికెట్లు కొన్నవారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని సీఏ ప్రకటించింది.

నో షేక్‌హ్యాండ్‌

నో షేక్‌హ్యాండ్‌

కరోనా కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏదైనా మ్యాచ్‌లో టాస్‌ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం ఆనవాయితీ. ఈ మ్యాచ్ సందర్భంగా టాస్‌ వేసిన తర్వాత ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌.. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయాడు. కరోనా గుర్తుకురావడంతో వెంటనే ఫించ్‌ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. తర్వాత విలియమ్సన్‌, ఫించ్‌లు తమ మోచేతులతో ట్యాప్‌ చేసుకున్నారు.

తొలి వన్డేలో ఆసీస్‌ విజయం

తొలి వన్డేలో ఆసీస్‌ విజయం

సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (67), ఆరోన్ ఫించ్ (60) అర్ధ సెంచ‌రీలు చేసారు. మార్నస్ లబుషేన్ (56) ఫామ్ కొనసాగించాడు. కివీస్ స్పిన్నర్ ఇష్ సోథికి 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో కివీస్ 187 పరుగులకే ఆలౌట్ అయింది. మార్టిన్ గుప్తిల్ (40) టాప్ స్కోరర్. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలో మూడు వికెట్లు తీశారు. ఆసీస్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి.

Story first published: Friday, March 13, 2020, 17:51 [IST]
Other articles published on Mar 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X