న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: 'విరాట్ కోహ్లీని తప్పిస్తారు సరే.. కొత్త కెప్టెన్‌ ప్రపంచకప్‌ గెలుస్తాడనే గ్యారంటీ ఏంటి?'

Kamran Akmal says Virat Kohli is a wonderful leader, to continue as Team India captain
What is the guarantee that another captain can win India an ICC trophy? | Oneindia Telugu

కరాచీ: ఎన్నో అంచనాల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. గతవారం న్యూజిలాండ్‌తో ముగిసిన మెగా ఫైనల్లో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత రెండేళ్లుగా జరిగిన డబ్ల్యూటీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక ఫైనల్లో మాత్రం తడబడింది.

ఈ ఓటమిని భారత మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు. భారత ఓటమికి విరాట్ కోహ్లీ చెత్త కెప్టెన్సీనే కారణమని, జట్టు సారథ్య బాధ్యతల నుంచి అతడిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీకి పాకిస్తాన్ మాజీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కమ్రాన్‌ అక్మల్‌ అండగా నిలిచాడు. విరాట్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమిస్తే ప్రపంచకప్‌ గెలుస్తాడనే గ్యారంటీ ఏంటని ప్రశ్నించాడు.

India vs England: ఇందిరా నగర్‌ గూండాతో శిఖర్‌ ధావన్‌! హలో చెప్పండి!!India vs England: ఇందిరా నగర్‌ గూండాతో శిఖర్‌ ధావన్‌! హలో చెప్పండి!!

అవి తప్ప మిగతావన్నీ సాధించాడు:

అవి తప్ప మిగతావన్నీ సాధించాడు:

'మై మాస్టర్ క్రికెట్ కోచ్' యూట్యూబ్ ఛానెల్‌లో కమ్రాన్‌ అక్మల్‌ మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీ గొప్ప క్రికెటర్‌. అద్భుతమైన కెప్టెన్‌ కూడా. మైదానంలో కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడు. ఎంతో భావోద్వేగంతో ఉంటాడు. టీమిండియాకు వచ్చిన ఏ నాయకుడైనా.. భారత క్రికెట్‌ను ముందుకే తీసుకెళ్తున్నాడు. సౌరవ్‌ గంగూలీతో ఇది మొదలైంది. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోనీ బాధ్యతలు స్వీకరించారు. అందరూ జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపారు. విరాట్‌ కోహ్లీ ఐసీసీ ట్రోఫీలు గెలవలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ అవి తప్ప మిగతావన్నీ సాధించాడు. కోహ్లీ కెప్టెన్సీ భారత్ ఎన్నో సిరీసులు గెలిచింది' అని అన్నాడు.

 గ్యారంటీ ఏమైనా ఉందా?:

గ్యారంటీ ఏమైనా ఉందా?:

'భారత్ ఐసీసీ టోర్నీలు గెలవకపోవడం పూర్తిగా విరాట్‌ కోహ్లీ ఒకడి తప్పు ఏమాత్రం కాదు. కోహ్లీ స్థానంలో మరొకరు వచ్చి.. ఐసీసీ టోర్నీ గెలుస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా?. పలానా వ్యక్తి ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడని ఎవరైనా హామీ ఇవ్వగలరా?. కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలి. అంతేగాని అనవసర రాద్ధాంతం చేయొద్దు. తుది దశకు చేరుకొని ఆఖరి అడ్డంకి దాటలేకపోతున్నారని.. కేవలం విరాట్‌నే నిందించడం న్యాయం కాదు. నా వరకైతే అతడెన్ని రోజులు నాయకత్వం వహించగలడని అనుకుంటే.. అన్ని రోజులు కెప్టెన్‌గా కొనసాగాలి' అని కమ్రాన్‌ అక్మల్‌ పేర్కొన్నాడు.

 మూడు ఐసీసీ టోర్నీల్లో:

మూడు ఐసీసీ టోర్నీల్లో:

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి విరాట్‌ కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇప్పటి వరకు మూడు ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఆ మూడింట్లో ఎందులోనూ భారత్‌ ట్రోఫీ గెలవలేదు. 2017 ఐసీసీ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో ఫైనల్‌లో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. తాజాగా జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో మరోసారి కివీస్‌తో ఓడింది. దాంతో నెటిజన్లు మీమ్స్‌తో కోహ్లీని ఎగతాళి చేస్తున్నారు. అంతేకాదు కోహ్లీ నుంచి నాయకత్వ బాధ్యతలు మరొకరికి అప్పజెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఒక్క ఐసీసీ టైటిల్ లేదు:

ఒక్క ఐసీసీ టైటిల్ లేదు:

టీమిండియాకు ఐసీసీ ఈవెంట్లు కలిసి రావడం లేదు. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు ఇంత వరకు మరో టైటిల్ గెలవలేదు. ఏడు సార్లు ఫైనల్స్‌కు చేరుకొని మరి ఓటమిని కొని తెచ్చుకుంది. ప్లేఆఫ్స్, నాకౌట్ దశకు సులభంగానే చేరుకుంటున్న టీమిండియాకు చివరి మొట్టుపై బోల్త పడటం అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత ఇది మరి ఎక్కువైంది.

Story first published: Monday, June 28, 2021, 16:17 [IST]
Other articles published on Jun 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X