Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: విరాట్ 50 సెంచరీల రికార్డును.. బాబర్ బ్రేక్ చేస్తాడంటున్న అక్మల్!

వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇటీవల న్యూజిల్యాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో చెలరేగిన అతను.. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 50 శతకాల రికార్డు సాధించి, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డు బద్దలు కొట్టాడు.

కోహ్లీ ఈ రికార్డు సాధించడంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. అందరూ ఈ గొప్ప ఫీట్‌ను తెగ మెచ్చుకున్నారు. ఇలాంటి మరో క్రికెటర్ పుట్టడంటూ కోహ్లీకి కితాబిచ్చారు. ఫ్యాన్స్ కూడా కోహ్లీ ఈ రికార్డు సాధించడంపై తెగ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతోంది.

Kamran Akmal says Babar Azam can Break Virat Kohlis 50 ODI centuries record

కోహ్లీ సాధించిన ఈ రికార్డును తమ బాబర్ ఆజమ్ బద్దలు కొడతాడని కమ్రాన్ అక్మల్ అన్నాడు. 'ఆ 50 సెంచరీల రికార్డును టాప్-3లో ఆడే బ్యాటర్ మాత్రమే బద్దలు చేయగలడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఈ రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం. మా దగ్గర బాబర్ ఆజమ్ ఉన్నాడు. తనొక్కడే ఈ రికార్డు బ్రేక్ చేయగలడు' అని చెప్పాడు.

అదే సమయంలో భారత్ వద్ద కూడా శుభ్‌మన్ గిల్ ఉన్నాడని, అతను కూడా ఈ రికార్డు వెంట పడగల సమర్ధుడే అని చెప్పాడు. 'బాబర్ టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. అలాగే భారత్ వద్ద కూడా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. అతను ఈ రికార్డు వెంట పడతాడు' అని కమ్రాన్ అన్నాడు.

ఇప్పటి వరకు చూసుకుంటే బాబర్ 114 వన్డే ఇన్నింగ్సులు ఆడాడు. వీటిలో 19 సెంచరీలు బాదాడు. అయితే ప్రస్తుతం బాబర్ వయసు 29 సంవత్సరాలే. ఈజీగా ఇంకో 7-8 ఏళ్లు ఆడగల సత్తా బాబర్‌కు ఉంది. ఇక గిల్ ఇప్పటి వరకు 43 వన్డే ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు చేసి ఉన్నాడు. వీళ్లిద్దరూ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా చాలా టైం పడుతుంది.

Story first published: Friday, November 17, 2023, 17:16 [IST]
Other articles published on Nov 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+