Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kamindu Mendis: హనీమూన్‌ను కూడా వదులుకుని ఐపీఎల్‌లో అరంగేట్రం!

Kamindu Mendis: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 80 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌‌లో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్‌కు తొలిసారి ఐపీఎల్ లో ఆడే అవకాశం లభించింది. ఈ ఆటగాడు తన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఘనత ఎవరూ సాధించలేదు. ఈ మ్యాచ్ లో శ్రీలంక స్పిన్ బౌలర్ కమిందు మెండిస్‌ ను ఐపీఎల్ 2025 మెగావేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్‌లోనే కమిందు మెండిస్ ఇప్పటివరకు ఐపీఎల్ లో చూడని అద్భుతాన్ని చేశాడు. ఈ మ్యాచ్ లో కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పిలుపుతో శ్రీలంక ఆల్ రౌండర్ తన హనీమూన్ ను వాయిదా వేసుకుని ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఐపీఎల్ కోసం తన హనీమూన్ ను కూడా త్యాగం చేశాడని తెలుస్తోంది. కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఒక ఓవర్ బౌలింగ్ వేసి 4 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ ను పడగొట్టాడు. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న అంగ్క్రిష్ రఘువంశీని ఔట్ చేశాడు. బ్యాటింగ్ లో కూడా కాస్త పరవాలేదనిపించాడు. కమిందు మెండిస్ 20 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సులు, ఒక ఫోర్ ఉంది.

Kamindu Mendis Cancelled His Honeymoon to Make His IPL Debut

ఐపీఎల్ కోసం హనీమూన్ ను రద్దు చేసుకున్నాడా?
శ్రీలంక ఆల్ రౌండర్ కమిందు మెండిస్ తన చిరకాల స్నేహితురాలైన నిష్నిని మార్చి 2025లో పెళ్లి చేసుకున్నాడు. మెండిస్ ఒక ప్రైవేట్ వేడుకలో తన దగ్గర బంధువుల సమక్షంలో నిష్నిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ లో ఎంగేజ్ మెంట్ జరిగినప్పటి నుంచి ఈ జంట వివాహం చర్చనీయాంశంగా మారింది. ఈ జంట మొదట్లో విదేశాలలో హనీమూన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఐపీఎల్ నుంచి పిలుపు రావడంతో ఆ ప్లాన్స్ ను రద్దు చేసుకున్నారట.

శ్రీలంకలోని అందమైన ప్రదేశమైన హపుటలేలో కమిందు, నిష్ని జంట కాసేపు గడిపారని తెలిసింది. తర్వాత మెండిస్ ఎస్ఆర్‌హెచ్ జట్టులో చేరడానికి భారత్ కు వచ్చేశాడు. తన హనీమూన్ కంటే ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆటతో పాటు ఐపీఎల్ లీగ్ పట్ల తన అంకితభావాన్ని కమిందు చూపించాడని అంతా కామెంట్లు చేస్తున్నారు. కొత్తగా పెళ్లైన భార్య కూడా చాలా మద్దతు ఇచ్చింది. క్రికెట్ పట్ల భర్త నిబద్ధతను అర్థం చేసుకునే నిష్ని లాంటి భాగస్వామి ఉండటం కమిందు అదృష్టమని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Friday, April 4, 2025, 9:23 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+