For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SL vs NZ: చరిత్ర సృష్టించిన కామిందు మెండిస్..డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్!

శ్రీలంక రైజింగ్ స్టార్ కామిందు మెండిస్ సంచలనాలు నమోదుచేస్తున్నాడు. టెస్టు క్రికెట్ అరంగేట్రంలో వరుసగా ఎనిమిది టెస్టుల్లో 50+ స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన 24 గంటల్లోపే.. మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ సారి దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుకొట్టాడు. గాలె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శతకంతో కదంతొక్కి మరో రికార్డు అందుకున్నాడు.

25 ఏళ్ల కామిందు మెండిస్ టెస్టుల్లో 13 ఇన్నింగ్స్‌ల్లోనే అయిదు సెంచరీలు బాదేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా అయిదు శతకాలు సాధించిన మూడో ప్లేయర్‌గా దిగ్గజ ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మన్, జార్జ్ హెడ్లీ‌లతో సమంగా నిలిచాడు. బ్రాడ్‌మన్, హెడ్లీ కూడా 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఎవర్టన్ వీక్స్ ఉన్నాడు. ఎవర్టన్ 10 ఇన్నింగ్స్‌ల్లో అయిదు టెస్టు సెంచరీలు బాదాడు.

Kamindu Mendis Becomes Fastest Asian to Score 5 Test Hundreds Equals Don Bradman

ఇక హెర్బర్ట్ స్కుట్లిఫ్, రాబర్ట్ హెవీ ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరు 12 ఇన్నింగ్స్‌ల్లో అయిదు శతకాలు సాధించారు. కాగా, ఆసియాలో అత్యంత వేగంగా ఈ ఘతన సాధించిన ఆటగాడు కామిందు మెండిస్. అంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ ప్లేయర్ ఫవాద్ అలామ్ పేరిట ఉండేది. ఫవాద్ 22 ఇన్నింగ్స్‌ల్లో అయిదు టెస్టు సెంచరీలు బాదాడు. ఇక శ్రీలంక తరఫున గతంలో అరవిండ డిసిల్వా (38 ఇన్నింగ్స్‌ల్లో) ఈ రికార్డు ఉంది.

కాగా, కామిందు మెండిస్ ఈ ఏడాది అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. జో రూట్ (4) రికార్డును అధిగమించాడు. ఇక టెస్టుల్లో 1000 పరుగులు వేగంగా సాధించిన ఆసియా క్రికెటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 13 ఇన్నింగ్స్‌ల్లో 900+ మార్క్‌ను అందుకున్న ఏడో క్రికెటర్ మెండిస్. ఆసియాలో ఈ ఘనత వేగంగా సాధించిన రికార్డు గతంలో వినోద్ కాంబ్లే (14 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉంది.

కామిందు మెండిస్ గత ఎనిమిది టెస్టుల్లో 61 (ఆస్ట్రేలియాపై), 102, 164 (బంగ్లాదేశ్), 92* (బంగ్లాదేశ్), 113 (ఇంగ్లండ్), 74 (ఇంగ్లండ్), 64 (ఇంగ్లండ్), 114 (న్యూజిలాండ్), 154* (న్యూజిలాండ్)పై 50+ స్కోరు సాధించాడు.

Story first published: Friday, September 27, 2024, 16:02 [IST]
Other articles published on Sep 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+