For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణం తెలియదు!: చెన్నైలో కమల్ హాసన్‌ను కలిసిన డ్వేన్ బ్రావో

Kamal Haasan gets signed T-shirt from Chennai Super Kings star Dwayne Bravo

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో బుధవారం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ను చెన్నైలో కలిశాడు. ఈ సందర్భంగా బ్రావో సంతకం చేసిన టీ షర్ట్‌ను కమల్ హాసన్‌కు అందజేశాడు. అనంతరం కమల్ హాసన్‌తో కలిసి డ్వేన్ బ్రావో ఫోటోలకు ఫోజులిచ్చాడు. కమల్‌తో కలిసి బ్రావో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

'గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ఇన్స్పిరేషన్' టైటిల్‌ను అందుకునేందుకు ఈ వారం మొదట్లో డ్వేన్ బ్రావో చెన్నైకి వచ్చాడు. ఈ క్రమంలో బ్రావో... తమిళ నటుడు కమల్ హాసన్‌ను కలిశాడు. ఇటీవలే ముగిసిన అబుదాబి టీ10 లీగ్‌లో డ్వేన్ బ్రావో మరాఠా అరేబియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ లీగ్‌లో బ్యాట్‌తో అంతగా ఆకట్టుకోలేకపోయిన బ్రావో బౌలింగ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు.

ఈ లీగ్ నవంబర్ 24న ముగిసింది. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ వెస్టిండిస్ ఆల్ రౌండర్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంఛైజీ ఆధారిక లీగుల్లో ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో బ్రావో కూడా ఉన్నాడు.

వెస్టిండిస్ తరుపున 40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 యావరేజితో 2200 పరుగులు చేయడంతోపాటు 86 వికెట్లు తీశాడు. ఇక, 164 వన్డేలాడిన బ్రావో 2968 పరుగులు చేయడంతోపాటు 199 వికెట్లు పడగొట్టాడు. 66 టీ20ల్లో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

వెస్టిండిస్ జట్టు తరుపున 270 మ్యాచ్‌ల్లో బరిలో దిగాడు. తన రిటైర్మెంట్ సందర్భంగా బ్రావో మీడియాతో మాట్లాడుతూ "14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నా" అని బ్రావో అన్నాడు.

Story first published: Wednesday, December 11, 2019, 17:30 [IST]
Other articles published on Dec 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+