హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం ఖరగ్‌పూర్‌కు చెందిన 77 ఏళ్ల కళావతి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ధోనికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి ముందు ధోని భారతీయ రైల్వేస్‌లో పని చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఖరగ్‌పూర్ స్టేషన్‌లోనే ధోని విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో ధోని ఇక్కడ టికెట్ చెకింగ్ ఉద్యోగిగా పనిచేసే సమయంలో సౌత్‌సైడ్‌లో రైల్వే వారు ఇచ్చిన ఇంట్లో ఉంటుండేవాడు. అప్పట్లో ధోనికి ఆ ఇంట్లో వంట తప్ప అన్ని పనులూ కళావతి చేసి పెట్టేది.

ధోని కూడా ఆమెను ప్రేమగా 'అమ్మా' అని సంబోధించేవారట. ఒకసారి ధోని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆమె తల్లిలా సేవలు చేసిందట. ఆ తర్వాత ధోనికి టీమిండియా తరపున క్రికెట్ ఆడేందుకు అవకాశం వచ్చింది. అప్ఫుడు వెళుతూ.. తిరిగి తప్పక కలుస్తానని ధోని మాటిచ్చాడని, ఇంతవరకు రాలేదని కళావతి ఎంతో ఆవేదనతో చెపుతోంది.
ఈ క్రమంలో గత 13 ఏళ్లుగా ఆమె ధోని కోసం ఎదురుచూస్తోంది. ధోని అందరినీ అడిగారని, 'అమ్మ' ఎలా ఉందని ప్రశ్నించారని, ఖరగ్‌పూర్ వచ్చినప్పుడు తప్పకుండా ఆమెను కలుస్తానని చెప్పినట్లు ఇటీవల ధోనిని కలిసిన వాసూరావు అనే వ్యక్తి తెలిపారు. హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం ఖరగ్‌పూర్‌కు చెందిన 77 ఏళ్ల కళావతి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ధోనికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి ముందు ధోని భారతీయ రైల్వేస్‌లో పని చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఖరగ్‌పూర్ స్టేషన్‌లోనే ధోని విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో ధోని ఇక్కడ టికెట్ చెకింగ్ ఉద్యోగిగా పనిచేసే సమయంలో సౌత్‌సైడ్‌లో రైల్వే వారు ఇచ్చిన ఇంట్లో ఉంటుండేవాడు. అప్పట్లో ధోనికి ఆ ఇంట్లో వంట తప్ప అన్ని పనులూ కళావతి చేసి పెట్టేది.
ధోని కూడా ఆమెను ప్రేమగా 'అమ్మా' అని సంబోధించేవారట. ఒకసారి ధోని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆమె తల్లిలా సేవలు చేసిందట. ఆ తర్వాత ధోనికి టీమిండియా తరపున క్రికెట్ ఆడేందుకు అవకాశం వచ్చింది. అప్ఫుడు వెళుతూ.. తిరిగి తప్పక కలుస్తానని ధోని మాటిచ్చాడని, ఇంతవరకు రాలేదని కళావతి ఎంతో ఆవేదనతో చెపుతోంది.
ఈ క్రమంలో గత 13 ఏళ్లుగా ఆమె ధోని కోసం ఎదురుచూస్తోంది. ధోని అందరినీ అడిగారని, 'అమ్మ' ఎలా ఉందని ప్రశ్నించారని, ఖరగ్‌పూర్ వచ్చినప్పుడు తప్పకుండా ఆమెను కలుస్తానని చెప్పినట్లు ఇటీవల ధోనిని కలిసిన వాసూరావు అనే వ్యక్తి తెలిపారు.