35వ పడిలోకి యువీ: సచిన్ ట్వీట్ ప్రత్యేకం
హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సోమవారం 35వ వసంతలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యువరాజ్‌కి పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యువీ పుట్టినరోజు సందర్భంగా సచిన్ టెండూల్కర్, హార్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, హార్దిక్‌పాండ్యా, కైఫ్, రవీంద్ర జడేజా గురుకీరత్‌మన్, ఆయుష్‌మాన్ ఖురానా, బీసీసీఐ, స్టార్‌స్పోర్ట్స్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
సచిన్ టెండూల్కర్
‘డ్రెసింగ్ రూమ్స్ నుంచి నిండిపోయిన మైదానాలు.. విజయాలు, అపజయాలు మేమిద్దరం కలిసే చూశాం. యువీకి జన్మదిన దిన శుభాకాంక్షలు' అని సచిన్ ట్వీట్ చేశాడు.
rn rnHappy birthday veere @YUVSTRONG12!! Enjoy your day! Khoob mazze karo! Wish you a wonderful year ahead! Love u brother from another mother! pic.twitter.com/wOfaTK1tS6
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 12, 2016
హార్భజన్ సింగ్
‘మరో తల్లి కన్న నా సోదరుడికి పుట్టిన రోజు అభినందనలు. ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు' అని హర్భజన్‌సింగ్ అన్నాడు.
రవీంద్ర జడేజా
‘యువీ లేకుండా టీ20, వన్డే ప్రపంచకప్ గెలవగలమని వూహించగలమా! అతడు అసలైన మ్యాచ్ విన్నర్' అంటూ రవీంద్ర జడేజా అన్నాడు.
గౌతం గంభీర్
‘పెళ్లి తర్వాత మగాళ్లు మళ్లీ జన్మిస్తారు. కాబట్టి యువీకి తొలి జన్మదిన శుభాకాంక్షలు. ప్రిన్స్‌కు ఇక అన్నీ మంచి రోజులే ముందున్నాయి' అని గౌతమ్ గంభీర్ శుభాకాంక్షలు అందించాడు.
హార్దిక్‌పాండ్యా
‘భారత ఛాంపియన్, పెద్దన్నకు శుభాకాంక్షలు. నిన్ను చూసి ఎన్నో నేర్చుకొన్నా. త్వరలోనే కలుసుకుంటా' అని యువ ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా పేర్కొన్నాడు.
ఐసీసీ
‘అతడు 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మరి ఒక ఓవర్‌లోనే యువీ నుంచి వచ్చిన 36 పరుగుల సంగతేంటి' అని ఐసీసీ పేర్కొంది.
మహ్మద్‌కైఫ్
‘విడిపోనిది మన స్నేహం' అంటూ మహ్మద్‌కైఫ్ శుభాకాంక్షలు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications