సూర్య నమస్కారం ఇస్లాంకు వ్యతిరేకమా?: కైఫ్ వివరణ
హైదరాబాద్: తన భార్య స్లీవ్ లెస్ గౌను ధరించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత పేసర్ షమీ వ్వవహారం సద్దుమణగకముందే మరో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వార్తల్లోకెక్కాడు. తాను సూర్య నమస్కారాలు చేస్తున్నట్లుగా ఉన్న నాలుగు యోగా ఫొటోలను డిసెంబర్ 31వ తేదీన కైఫ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
సూర్య నమస్కారంపై ట్విట్టర్‌లో కైఫ్
‘సూర్య నమస్కారం వల్ల దేహంలోని ప్రతి వ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. ఎటువంటి ఉపకరణాలు లేకుండా చేయగల పరిపూర్ణ వ్యాయామం. నా ఫిట్‌నెస్ రహస్యం' ఇదే అని ట్విట్టర్‌లో కామెంట్ రాశాడు. కైఫ్ దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలపై విమర్శల వర్షం కురిపించిన నెటిజన్లు
ఇంకేముంది సూర్య నమస్కారాలు ఇస్లాంకు వ్యతిరేకమని, అవి ఓ మతానికి చెందిన వంటూ నెటిజన్లు ఈ ఫోటోలపై విమర్శల వర్షం కురిపించారు. నువ్వు ఓ ముస్లిం అయి ఉండి సూర్య నమస్కారాలు చేస్తావా? మత విశ్వాసాలను ఉల్లంఘింస్తున్నావని కైఫ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఘాటుగా స్పందించిన కైఫ్
సూర్య నమస్కారం విషయంలో తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను కైఫ్ తన ట్విట్టర్ వేదికగా కాస్తంత ఘాటుగానే స్పందించాడు. ‘సూర్య నమస్కారాలు శారీరానికి సంబంధించి, ఎలాంటి పరికరం సాయం లేకుండా చేసే పరిపూర్ణ వ్యాయామం' అని పేర్కొన్నాడు.
శారీరక కసరత్తులకు మతానికి ఎప్పుడూ సంబంధం ఉండదు
శారీరక కసరత్తులకు మతానికి ఎప్పుడూ సంబంధం ఉండదని కైఫ్ స్పష్టం చేశాడు. వ్యాయామం చేసే సమయంలోనూ తన మదిలో అల్లానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. ఫొటోల్లో కాదు మతంతో చేసే ఎక్సర్‌సైజ్‌లు ఎలా ఉంటాయో నాకు తెలియదంటూ కైప్ తనపై వ్యాఖ్యలు చేసిన వారికి చురకలంటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications