Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravichandran Ashwin: స్టీవ్ స్మిత్ హెల్మెట్ కు కెమెరా.. అశ్విన్ ఏం చేశాడంటే..!

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తో తమకు ఉన్న బంధాలను మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ కైఫ్ అశ్విన్ తో తనకున్న ఉన్న బంధాన్ని వివరించాడు. ప్రత్యర్థుల బలహీనతలను అశ్విన్ ఇట్టే కనిపెడతాడని ప్రశంసించారు. అతనికి సూక్ష్మపరిశీలన శక్తి ఎక్కువగా ఉందన్నాడు. ఐపీఎల్2020 లో కైఫ్ అశ్విన్ తో కలసి పని చేశాడు. ఆసీస్‌ బ్యాటర్ స్టీవ్‌స్మిత్‌ కూడా (2020లో) ఢిల్లీకి ఆడిన సంగతి తెలిసందే.

నెట్స్‌లో అశ్విన్‌తో జరిగిన ఓ ఘటను కైఫ్‌ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. తన ఎక్స్ హ్యాండిల్‌లో వీడియోలో మాట్లాడుతూ "2020 ఐపీఎల్ లో అశ్విన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని కొత్త బాల్ బౌలింగ్ పవర్ ప్లేలో మాకు వికెట్లు పడగొట్టడంలో సహాయపడింది. మేము ఫైనల్ కు చేరుకున్నాం. అప్పుడే అశ్విన్ టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పుడు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ దుబాయ్ లోనే జరిగాయి. అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టివ్ స్మిత్ కూడా ఢిల్లీకి ఆడుతున్నాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అశ్విన్ ను బౌలింగ్ చేయాలని కోరా" అని కైఫ్ గుర్తు చేశాడు.

Kaif recalls Ashwin telling him not to bowl to Steve Smith

దానికి అశ్విన్ "నేను బౌలింగ్ చేయను" అని బదులిచ్చాడని కైఫ్ గుర్తు చేశాడు. ఎందుకు అని అడగ్గా.. స్మిత్ తన హెల్మెట్ కు కెమెరా అమర్చిట్లు కనిపించిందని వివరణ ఇచ్చినట్లు కైఫ్ చెప్పాడు. బౌలింగ్ రికార్డు చేసి.. తమ టెక్నిక్ ను విశ్లేషించి.. వరల్డ్ కప్ లో అడతారని.. అందుకే బౌలింగ్ చేయనని అశ్విన్ చెప్పినట్లు కైఫ్ గుర్తు చేశాడు. దీంతో తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు. స్మిత్ హెల్మెట్ లో కెమోరా పెట్టినట్లు తను గుర్తించలేదని పేర్కొన్నాడు.

అశ్విన్ ఆస్ట్రేలియాపై 115 వికెట్లతో సహా 106 మ్యాచ్‌ల్లో 537 వికెట్లు పడగొట్టాడని కైఫ్ మెచ్చుకున్నాడు. ప్రత్యర్థులను ఔట్‌విట్ చేయడంలో అతని సామర్థ్యమే అతనికి నిజంగా ప్రత్యేకమన్నాడు. అశ్విన్ ఐపీఎల్ 2025లో చెన్నైసూపర్ కింగ్స్ ఆడనున్నాడు. సీఎస్కే అతన్ని రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, December 22, 2024, 16:00 [IST]
Other articles published on Dec 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+