
ఢిల్లీకి ప్రాతినిధ్యం
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రబాడకు ఢిల్లీ జట్టు 4.2 కోట్ల రూపాయలు చెల్లించింది. గతేడాది ఐపీఎల్‌లో మొత్తంగా 15 మ్యాచ్‌లు ఆడిన రబాడ 15 వికెట్లు తీశాడు. 2020 సీజన్‌లో రబాడ ఏకంగా 30 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే 2019లో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడిన 26 ఏళ్ల ఈ స్టార్ పేసర్ 76 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/21.

రిటెన్షన్ జాబితాలో దక్కని చోటు
2022 ఏడాదికి గాను ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితాలో కగిసో రబాడకు చోటు దక్కలేదు. దీంతో అతను ఈ సారి వేలంలో పాల్గొననున్నాడు. కాగా 2022 ఏడాదికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ రిటెన్షన్ జాబితాలో నలుగురు ఆటగాళ్లకు చోటు ఇచ్చింది. రిషబ్ పంత్, పృథ్వీ షా, నోర్జే, అక్షర్ పటేల్‌ను తమ రిటెన్షన్ జాబితాలో చేర్చింది.

పంజాబ్‌లోకి రబాడ
ఈ సారి మెగా వేలంలో పాల్గొనున్న రబాడను పంజాబ్ కింగ్స్ దక్కించుకోవడం ఖాయంగా తెలుస్తోంది. మంచి పేసర్ అయినా రబాడను టీంలోకి తీసుకుంటే తమ పేస్ దళం బలపడుతుందని పంజాబ్ యూనిట్ భావిస్తోంది. అంతేకాకుండా రబాడ ప్రస్తుతం మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లోనూ నిలకడగా రాణించాడు. దీంతో ధర ఎంతైనా సరే రబాడను కోనుగోలు చేయాలని పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని సమాచారం. కాగా ఈ ఏడాది తమ రిటెన్షన్ జాబితాలో పంజాబ్ కింగ్స్ జట్టు ఇద్దరికి మాత్రమే చోటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరిలో ఒకరు మయాంక్ అగర్వాల్ కాగా, మరొకరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అర్షదీప్ సింగ్.

ధర ఎంతంటే?
గతంలో కగిసో రబాడకు ఢిల్లీ క్యాపిటల్స్ 4.2 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ సారి వేలంలో రబాడను దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న పంజాబ్‌క కింగ్స్ యాజమాన్యం అతనికి 12 కోట్ల రూపాయల వరకు చెల్లించే ఆలోచనలో ఉందట. అదే జరిగితే రబాడకు బంపర్ ఆఫర్ తగిలినట్టే. ఎందుకంటే గత సీజన్‌తో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. అయితే గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన పంజాబ్ ఈ సారి సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దీంతో రబాడ వంటి టాలెంటెడ్ ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications












