హైదరాబాద్: దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడపై ఒక టెస్టు మ్యాచ్ వేటు పడింది. దీంతో ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగే రెండో టెస్టుకు రబాడ దూరం కానున్నాడు. వివరాల్లోకి వెళితే లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బెన్‌స్టోక్స్‌ని అవుట్ చేసిన అనంతరం రబాడ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
బెన్ స్టోక్స్ అవుటైన తర్వాత అతడిని పరుష పదజాలంతో దూషించాడు. ఇదంతా స్టంప్స్ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది ఐసీసీ నియమావళిని ఉల్లంఘించడం కావడంతో రబడాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. దీంతో క్రమశిక్షణ నియమావళిని ఉల్లఘించిన అతని ఖాతాలోకి ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్‌ని చేర్చింది.

గడిచిన 24 నెలల్లో రబాడ నాలుగు డీ మెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో చేరడంతో అతడిపై ఐసీసీ ఒక టెస్టు సస్పెన్షన్ వేటు వేసింది. అయితే అంపైర్ల ఫిర్యాదు మేరకు ఐసీసీ రెఫరీలు రబాడపై యాక్షన్ తీసుకున్నారు. మరొవైపు మ్యాచ్ ఫీజులతో 15 శాతం కోత విధించారు.
ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక ఓపెనర్ డిక్వెల్లాతో గొడవపడి మూడు డీమెరిట్ పాయింట్లను తెచ్చుకున్నాడు. తాజాగా తన దురుసు ప్రవర్తనతో మరో పాయింట్ రావడంతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఒక ఏడాదిలోనే నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తే ఆ ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధం పడేలా గత ఏడాది ఐసీసీ నిబంధన ఉంది.
ఇదిలా ఉండే లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి
214 పరుగులు చేసింది.