న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌దే టైటిల్: బౌలింగ్ మా ప్రధాన బలం అంటోన్న రబాడ

IPL 2019 : Kagiso Rabada Excited For Fresh Start With Rechristened Delhi Capitals | Oneindia Telugu
Kagiso Rabada excited for fresh start with rechristened Delhi Capitals

హైదరాబాద్: ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు బలంగా కనిపిస్తోందని ఆ జట్టు పేస్ బౌలర్ కగిసొ రబాడ అన్నాడు. తాజా సీజన్ కోసం రబాడ ఇటీవలే జట్టులో చేరాడు. ఈ సందర్భంగా రబాడ మాట్లాడుతూ "ఈసారి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కచ్చితంగా మంచి జట్టుగా కనిపిస్తోంది. జట్టులో ఎక్కువమంది కుర్రాళ్లు ఉన్నారు" అని అన్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

"యువ ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులైన విదేశీ ఆటగాళ్ల కలయికతో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాక అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా పేస్‌ బౌలింగ్‌ ఈసారి మా ప్రధాన బలం. ఈసారి సీజన్లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నా" అని కగిసో రబాడ పేర్కొన్నాడు.

సరికొత్తగా ముస్తాబు

సరికొత్తగా ముస్తాబు

"ఈసారి కొత్త జట్టు పేరుతో, కొత్త జెర్సీతో బరిలో దిగుతున్నా. ఈసారి సీజన్లో ఢిల్లీ రాణిస్తుందని ఆశిస్తున్నా" అని రబాడ అన్నాడు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చింది. అంతేకాదు కోచింగ్‌ సిబ్బంది కూడా అనేక మార్పులు చేసింది.

ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మార్చి 24న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇదిలా ఉంటే, తమ సొంతగ్రౌండ్‌లో జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తెవాతియా, జయంత్ యాదవ్, మన్జోత్ కల్రా, కాలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కగిసో రబాడ, సందీప్ లామిచానే, ట్రెంట్ బౌల్ట్,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హనుమ విహారీ (రూ. 2 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 5 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ.1.1 కోట్లు), అంకుశ్ బెయిన్స్‌ (రూ.20 లక్షలు), నాథూ సింగ్‌ (రూ.20 లక్షలు), కాలిన్ ఇన్‌గ్రామ్ (రూ.6.4 కోట్లు), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్‌ (రూ.1.6 కోట్లు), కీమో పాల్‌ (రూ.50 లక్షలు), జలజ్ సక్సేనా (రూ.20 లక్షలు), బండారు అయ్యప్ప (రూ.20 లక్షలు).

Story first published: Saturday, March 23, 2019, 10:18 [IST]
Other articles published on Mar 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X