అదేం బౌలింగ్ రా భయ్: నిప్పులు చెరగడం అంటే ఇదే మరి

లండన్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మళ్లీ పరాజయాల బాట పట్టినట్టు కనిపిస్తోంది. టెస్ట్ ఫార్మట్‌లో ఇదివరకు టీమిండియా, న్యూజిలాండ్‌పై విజయం సాధించిన గాడిన పడిందనుకున్న దశలో మళ్లీ దాని జర్నీ మొదటికొచ్చింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికాకు ధారదాత్తం చేసుకుంది. టెస్ట్ సిరీస్‌లోనూ ఇదే కంటిన్యూ చేసేలా ఉంది ఇంగ్లాండ్ పరిస్థితి.
ఏడు వికెట్లతో..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా- లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్ 12 పరుగుల తేడాతో ఓడింది ఇంగ్లాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 165 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబడ అయిదు వికెట్లతో నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్‌లో దక్షిణాఫ్రికా 326 పరుగులు చేసింది. తన రెండో ఇన్నింగ్‌లో ఇంగ్లాండ్ 149 పరుగులకే కుప్పకూలింది. ఇక్కడా కగిసొ రబడ దెబ్బకొట్టాడు. రెండు వికెట్లు పడగొట్టాడు.
డబ్ల్యూటీసీలో టాపర్
తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగుల ఆధిక్యతను సాధించిన దక్షిణాఫ్రికాపై ఏ మాత్రం కూడా పైచేయి సాధించలేకపోయింది. 149 చాపచుట్టింది. వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన తరువాత ఇంగ్లాండ్ ఎదురైన తొలి ఘోర పరాజయం ఇదే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యతను సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచింది. డీన్ ఎల్గర్ సారథ్యంలో ప్రొటీస్ టీమ్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

250 వికెట్ల క్లబ్..
ఈ మ్యాచ్‌లో కగిసో రబడ నిప్పులు చెరిగాడు. మెరుపుదాడితో బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అయిదు, రెండో ఇన్నింగ్‌లో రెండు వికెట్లు నేల కూల్చాడు. అయిదు వికెట్లను హాల్ సాధించి లార్డ్స్ హానర్‌బోర్డ్‌లో తన లిఖించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడు వికెట్లతో అరుదైన ఘనతను సాధించాడు రబడ. టెస్ట్ క్రికెట్‌లో 250 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అతి తక్కువ మ్యాచ్‌లు అంటే 53 టెస్టుల్లో అతను ఈ రికార్డ్ నెలకొల్పాడు.
53 మ్యాచ్‌లల్ల..
250 వికెట్లు పడగొట్టిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్ అతనే. టెస్టుల్లో దక్షిణాఫ్రిక తరఫున అత్యధిక వికెట్లను పడగొట్టి బౌలర్ డేల్ స్టెయిన్. 439 వికెట్లతో అతను అగ్రస్థానంలో ఉన్నారు. స్టెయిన్ తరువాత షాన్ పొల్లాక్-421, మఖయ ఎన్తిని-390, అలన్ డొనాల్డ్-330, మోర్నె మోర్కెల్-309, జాక్వెస్ కల్లిస్-291 ఉన్నారు. ఇప్పుడా జాబితాలో కగిసొ రబడ చేరాడు. 53 మ్యాచ్‌లల్లోనే ఈ రికార్డ్ సాధించడం అతని స్పెషాలిటీ. చివరి ఎనిమిది ఇన్నింగుల్లో 28 వికెట్లు పడగొట్టాడంటే రబడ ఏ స్థాయిలో చెలరేగుతోన్నాడనేది అర్థమౌతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications