'సూపర్ సిక్స్'తో డివిల్లీయర్స్ రికార్డ్ బద్దలు కొట్టిన రబడ
జోహన్నస్‌బర్గ్: యువ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడ రికార్డ్ సృష్టించాడు. మంగళవారం నాడు క్రికెట్ సౌత్ ఆఫ్రికా వార్షిక అవార్డుల కార్యక్రమంలో అతను 'సూపర్ సిక్స్'తో రికార్డ్ సృష్టించాడు. రబడ వయస్సు 21. ఇతను 2015 నవంబర్‌లో మొహాలీలో భారత్ పై ఆడటం ద్వారా టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు.
ఇతను టెస్ట్, వన్డేలలో సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. వీటితో పాటు ప్లేయర్ ఛాయిస్, ఫ్యాన్స్ చాయిస్, బెస్ట్ డెలివరీ గెలుచుకున్నాడు. మొత్తంగా అతను సిక్స్ అవార్డులు గెలిచాడు.
వ్యక్తిగతంగా ఆరు అవార్డులు గెలుచుకున్న తొలి ఆటగాడు రబడ కావడం గమనార్హం. ఏబీ డివిల్లీయర్స్, హషీమ్ అమ్లాలు గతంలో 5 అవార్డులు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి.

సీఎస్ఏ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న వారిలో రెండుసార్లు గెలుచుకున్న వారు ఉన్నారు. అందులో జాక్వెస్ కల్లిస్ (2004, 2011), మఖయా తిని (2005త, 2006), ఆమ్లా (2010, 2013), డివిల్లీయర్స్ (2014, 2015)లు ఉన్నారు.
షాన్ పొలాక్ 2007లో, డేల్ స్టెయిన్ 2008లో, గ్రేమ్ స్మిత్ 2009లో, వెర్నాన్ ఫిలాండర్ 2012లో గెలుచుకున్నాడు. కాగా, రబడ 2015 జూలై నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే ఆరంగేట్రం చేశాడు. ఇతను ఆరు వికెట్లు తీసుకొని 16 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఒకటి హ్యాట్రిక్. అప్పుడే అతని సత్తా తెలిసింది.
ఇవీ అవార్డులు
సౌతాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - రబడ
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - రబడ
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - రబడ
సౌతాఫ్రికా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - రబడ
సౌతాఫ్రికా ఫ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - రబడ
డెలివరీ ఆఫ్ ది ఇయర్ - రబడ
ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఆఫ్ ది ఇయర్ - ఇమ్రాన్ తాహిర్
సో గూడ్ అవార్డ్ - తెంబా బువమా
ఇంటర్నేషనల్ ఆరంగేట్ర క్రీడాకారుడు - స్టీఫేన్ కుక్
మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - డేన్ వాన్ నీకెర్క్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications