PBKS vs KKR Playing 11: నిప్పులు చెరగడానికి ఆ బౌలర్ తయార్: డ్రీమ్ 11 టీమ్ కేప్టెన్‌గా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవ్వాళ కీలకమైన మ్యాచ్ జరుగనుంది. చెరో విజయం సాధించిన రెండు జట్లు తలపడబోతున్నాయి. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. తిరుగులేని విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్.. తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ను రఫ్పాడించిన కోల్‌కత నైట్ రైడర్స్.. ఇవ్వాళ ఫేస్ టు ఫేస్ తేల్చుకోబోతోన్నాయి. ముంబైలోని వాంఖెడె స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది.

ఆల్‌రౌండర్లతో ఫుల్‌గా
తొలి మ్యాచ్‌లోనే తన సత్తా ఏమిటో చాటి చెప్పింది పంజాబ్ కింగ్స్. మెగా ఆక్షన్ తరువాత టీమ్ మొత్తాన్నీ ఆల్‌రౌండర్లతో నింపేసింది. మయాంక్ అగర్వాల్ కేప్టెన్సీలో కొత్తగా కొత్తగా కనిపిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, శిఖర్ ధవన్, కగిసో రబడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, షారుఖ్‌ఖాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఓడియన్ స్మిత్, నాథన్ ఎల్లీస్, భానుక రాజపక్స, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రాజ్ ఆనంద్ బావా, రిత్తిక్ ఛటర్జీ.. సీనియర్లు, జూనియర్లతో మంచి బ్యాకప్‌ను సిద్ధం చేసుకుంది.

రబడ డెబ్యూ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో కగిసొ రబడ ఆడలేదు. క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి వచ్చినందున జట్టుకు దూరంగా ఉంటోన్నాడు. ఇప్పుడతను తన మూడు రోజుల క్వారంటైన్ పీరియడ్‌ను కంప్లీట్ చేసుకున్నాడు. జట్టుతో కలిశాడు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై నిప్పులు చెరగడానికి తయారుగా ఉన్నాడీ దక్షిణాఫ్రికన్ స్పీడ్ స్టర్. కిందటి సీజన్ వరకు అతను ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడాడు. ఇప్పుడతని ఫ్రాంఛైజీ మారింది.

బౌలింగ్ విభాగానికి లీడ్..
పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను రబడ లీడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్, ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్‌తో కూడిన బౌలింగ్ విభాగంలో రబడ ఓ లెథల్ వెపన్‌గా చెప్పుకోవడంలో సందేహాలు అక్కర్లేదు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లపై ఎలాంటి ఒత్తిళ్లను తీసుకుని రాగలుగుతాడనేది ఈ సాయంత్రం నాటి మ్యాచ్‌తో స్పష్టంగా తెలిసిపోతుంది.

పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కత బౌలర్ అరుదైన రికార్డ్..
కోల్‌కత నైట్ రైడర్స్ పరిస్థితీ ఇంతే. రాయల్ ఛాలెంజర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. బౌలర్లు రాణించారు. చివరి ఓవర్ వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లగలిగారు. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ కూడా బలంగా ఉంది. నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్.. ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై అత్యధిక వికెట్లను పడగొట్టాడీ కరేబియన్ బౌలర్. 21 మ్యాచ్‌లల్లో 31 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ పవర్ ప్లేలో 7.60 ఎకానమీ రేట్‌తో ఉమేష్ యాదవ్ 49 వికెట్లు తీసుకున్నాడు.

తుదిజట్టు కూర్పు ఇలా..
పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), భానుక రాజపక్స (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, రాజ్ బావా, మహ్మద్ షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కగిసొ రబడ, రాహుల్ చాహర్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. కోల్‌కత టీమ్‌లో- వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్/చామిక కరుణరత్నె/మహ్మద్ నబీ, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆడొచ్చు.

డ్రీమ్ 11 టీమ్‌లో
డ్రీమ్ 11 టీమ్‌లో శ్రేయాస్ అయ్యర్ (వైస్ కేప్టెన్), ఆండ్రీ రస్సెల్ (వైస్ కేప్టెన్‌గా రెండో ఆప్షన్), శిఖర్ ధవన్ (కేప్టెన్), మయాంక్ అగర్వాల్ (కేప్టెన్‌గా రెండో ఆప్షన్), భానుక రాజపక్స (వికెట్ కీపర్), ఆల్‌రౌండర్ల కేటగిరీలో లియామ్ లివింగ్‌స్టోన్, వెంకటేష్ అయ్యర్, బౌలర్లుగా ఉమేష్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిని తీసుకోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications