ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ అరుదైన ఘనతలు సాధించాడు. ముష్ఫికర్ రహీమ్‌ను ఔట్ చేసి టెస్టుల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో రబాడ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. బంతుల పరంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్ల సాధించిన బౌలర్‌గా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు.
అంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉండేది. వకార్ యూనిస్ 12602 బంతుల్లో ఈ ఘనత సాధించగా, రబాడ 11817 బంతుల్లోనే 300 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో రబాడ, వకార్ యూనిస్ తర్వాతి స్థానాల్లో డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా- 12605), అలాన్ డొనాల్డ్ (సౌతాఫ్రికా- 13672) ఉన్నారు.

కాగా, టెస్టుల్లో 300 వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా మూడో ఫాస్ట్ బౌలర్‌గా రబాడ నిలిచాడు. రబాడ కంటే ముందు స్టెయిన్, డొనాల్డ్ ఈ ఘనత సాధించారు. అయితే మ్యాచ్‌ల పరంగా 300 వికెట్ల మార్క్‌ను రబాడ (65 మ్యాచ్‌లు) కంటే ముందు డేల్ స్టెయిన్ (61), అలాన్ డొనాల్డ్ (63) అందుకున్నారు. ఓవరాల్‌గా సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆరో బౌలర్‌గా రబాడ రికార్డు నెలకొల్పాడు.
టెస్టుల్లో 300 వికెట్లను ఇప్పటివరకు 38 మంది సాధించారు. అయితే అందరిలో మెరుగైన స్ట్రైక్‌రేటు రబాడనే సాధించాడు. రబాడ స్ట్రైక్‌రేటు 39.3. అతని తర్వాతి స్థానంలో ఉన్న డేల్ స్టెయిన్ 42.3. అంటే టెస్టుల్లో రబాడ ప్రతి 39 బంతులకు సగటును ఒక్క వికెట్ పడగొడుతున్నాడు. కాగా, రబాడ (2/16)తో పాటు వియాన్ ముల్డర్ (3/22) చెలరేగడంతో బంగ్లాదేశ్ తొలి రోజు ఆటలో లంచ్ విరామానికి 26.1 ఓవర్లలో 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
Kagiso Rabada gets his 300th test wicket! ⚡
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2024
Congratulations to Kagiso Rabada on reaching a monumental milestone, delivered at 13.5 overs in today’s Test against Bangladesh! 👏🏏🇿🇦
Your dedication to the craft and game-changing pace continues to inspire the nation.
Here’s to… pic.twitter.com/5b6IlTOfQ1