Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీలా సంబరాలు, కబడ్డీపై మక్కువ: ఇషాన్ పోరెల్ ఆసక్తికర విషయాలు

Kabaddi, not cricket was Ishan Porel's first-choice sport

హైదరాబాద్: న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో ఇషాన్ పోరెల్ ఒకడు. అండర్-19 వరల్డ్ కప్‌లో ఇషాన్ పోరెల్ ప్రదర్శన పట్ల అతడి తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి టోర్నీ తొలి మ్యాచ్‌లోనే పోరెల్ గాయపడ్డాడు.

గాయం నుంచి కోలుకున్న తర్వాత పోరెల్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కూడా చక్కటి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 7 ఓవర్లు వేసి 2 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, నిజానికి పోరెల్ తన కెరీర్ అరంభంలో కబడ్డీలో రాణించాలని అనుకున్నాడు.

ఇషాన్ పోరెల్ తల్లిదండ్రులిద్దరూ అంతర్జాతీయస్థాయి కబడ్డీ ప్లేయర్లు కావడంతో వారిని స్పూర్తిగా తీసుకున్న ఇషాన్ పోరెల్ చిన్నతనంలో కబడ్డీ క్రీడాకారుడిగా రాణించాలని అనుకున్నాడట. అయితే అనూహ్యంగా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్‌తో భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత పోరెల్ మీడియాతో మాట్లాడాడు.

మిడ్ డే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో పోరెల్ మాట్లాడుతూ 'తొలుత స్విమ్మింగ్ నేర్చుకోవడానికి శిక్షణలో చేరాను. అందులో ఇమడలేక టేబుల్ టెన్నిస్ నేర్చుకునేందుకు వెళ్లా. ఆ తర్వాత నా తల్లిదండ్రులు రాణించిన కబడ్డీ ఆటపై ఇష్టం పెంచుకున్నా' అని తెలిపాడు.

'అయితే ఈ క్రీడలేవీ నన్ను సంతృప్తి పరచలేదు. చిన్న వయసు నుంచే టీవీలో క్రికెట్ చూసే అలవాటు ఉండేది. ఒక రోజు మా నాన్న వద్దకు వెళ్లి నాన్నా నేను క్రికెట్ కోచింగ్ తీసుకుంటానని తన మనసులో మాట చెప్పా. ఆయన అందుకు ఒప్పుకున్నారు. కానీ, ఆ సమయంలో ఎందుకు కబడ్డీని వదిలేస్తున్నావని ఆయన నన్ను అడగలేదు. అలా క్రికెట్‌లోకి అడుగుపెట్టా' అని వివరించాడు.

అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో గాయపడటంపై కూడా పోరెల్ స్పందించాడు. 'గాయంతో టోర్నీలో మిగతా మ్యాచ్‌లు ఆడలేనని అనుకున్నా. నా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆదిత్య థాకరే న్యూజిలాండ్‌కు రావడం, జట్టులో చేరిపోవడం చకా చకా జరిగిపోయాయి. దీంతో నిరాశ చెందా. ఆ సమయం ఎంతో కష్టంతో కూడుకున్నది' అని అన్నాడు.

'అయితే ఇక్కడ రాహుల్ సర్, డాక్టర్ ఆనంద్ దాటే (ఫిట్‌నెస్ ట్రైనర్)కు ధన్యవాదాలు తెలుపుకోవాలి. వీరిద్దరూ ఎంతో మద్దుతుగా నిలిచారు. తొలుత ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. ఆ తర్వాత నన్ను క్వార్టర్ ఫైనల్స్‌ ఆడేలా సిద్ధం చేశారు' అని చెప్పాడు.

వికెట్ పడిందంటే చాలు టీమిండియా జాతీయ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలోనే మైదానంలో ప్రత్యర్థుల వైపు చూస్తూ సంబరాలు చేసుకోవడంపై కూడా పోరేల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. 'నేను తీసిన ప్రతి వికెట్ ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటా. ఒక ఫాస్ట్ బౌలర్‌గా దూకుడునే ఆయుధంగా భావిస్తా' అని ఇషాన్ పోరెల్ వెల్లడించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 15:47 [IST]
Other articles published on Feb 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+