పంత్ పరుగుల వరద వెనుక కారణం ఆ ఇద్దరి..

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ఫిరోజ్ షా కోట్లా వేదికగా తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ జట్టు విజయం సాధించినా క్రెడిట్ అంతా రిషబ్ పంత్ కొట్టేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 63 బంతుల్లో 128 పరుగులు చేశాడు. అయితే ఈ విషయంలో సాధారణంగా అగ్రెసివ్ ఆటను ప్రదర్శించే పంత్.. నిన్న ఘోరతప్పిదాలు చేసినందుకే బాధ్యతను మరింత రెట్టింపు చేసి ఆడి అంతటి స్కోరును చేశానని చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ ఇన్నింగ్స్ మందకొడిగా సాగుతున్నవేళ అయ్యర్, హర్షల్ పలేట్‌లు అనూహ్యరీతిలో రనౌట్ అయ్యారు. ఆ ఇద్దరి రనౌట్‌లకు కారణం పంతే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతను దానికి వివరణ ఇచ్చాడు.

అసలేం జరిగింది:
‘తప్పు చేశాను. పరుగు తీయాలా వద్దా అని సరిగా అంచనా వేయలేకపోయాను. దీంతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయా. ఇది క్రికెట్‌లో సహజమే. అయితే, ఆ రెండు రనౌట్ల తర్వాత నేను మరింత బాధ్యతగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అని ఇప్పుడే చెప్పలేనుగానీ, వన్ ఆఫ్ ది బెస్ట్‌గా మాత్రం నిలుస్తుంది..' అని వివరించాడు.

రెండో పిన్న వయస్కుడిగా రికార్డు:
మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు-2009లో) తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా పంత్ (20 ఏళ్ల 218 రోజులు) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

భువీకి చుక్కలు చూపించిన పంత్:
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతోన్న భువీకి పంత్ చుక్కలు చూపించాడు. చివరి ఓవర్‌లో ఐదు బంతులు ఆడిన రిషబ్ ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. 4,4,6,6,6 గణాంకాలు నమోదయ్యాయి. వీటిలో నాలుగో బంతిని ఒంటిచేత్తో సిక్సర్‌గా మలిచిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

నిరాశ మిగిల్చిన పంత్ పోరాటం..:
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అయినా ఫలితం లేకపోయింది. పంత్ శ్రమతో ఢిల్లీ చేసిన స్కోరును.. శిఖర్ ధావన్, విలియమ్సన్‌ల సూపర్ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ అలవోకగా ఛేదించింది. హైదరాబాద్ తొమ్మిదో విజయంతో ఐపీఎల్-11లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఘనత సాధించగా.. ఢిల్లీ ఎనిమిదో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నమోదైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications