Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ కోసమే ఆడితే కప్ గెలవ లేరు: ఇండియాపై స్టీవ్ వా

Steve Waugh
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ కోసం ప్రపంచ కప్ గెలుస్తామని భారత క్రికెట్ జట్టు సభ్యులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఏకీభవించడం లేదు. ఆ అభిప్రాయం సరైంది కాదని ఆయన అన్నారు. అలా అనుకుని ఆడితే ప్రపంచ కప్ భారత్‌కు దక్కకపోవచ్చునని ఆయన అన్నారు. ఒక్కడి కోసం విజయం సాధించాలనే విధానమే సరైంది కాదని, అలా ఆడితే ధోనీ సేన కప్‌కు దూరమవుతుందని ఆయన అన్నారు.

జట్టు కోసం ఆడాలని, దేశం కోసం ఆడాలని, వ్యక్తి కన్నా ఆట గొప్పదని ఆయన అన్నారు. ఫేవరేట్లలో భారత్ జట్టు ఒకటని ఆయన అన్నారు. ఈ ప్రపంచ కప్ పోటీల్లో సచిన్ పాత్ర కీలకమైందని ఆయన అన్నారు. సచిన్ టోర్నీ స్టార్ కాకపోవచ్చునని, అయితే సంక్షోభ సమయాల్లో సచిన్ కీలకమవుతాడని ఆయన అన్నారు. హస్సీ ఆస్ట్రేలియా జట్టులో లేకపోవడం లోటేనని ఆయన అన్నారు. హస్సీని జట్టులోకి తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+