Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Just amazing: ఉప్పల్‌ స్టేడియంలో కోహ్లీ 94 నాటౌట్, నెలకొల్పిన రికార్డులివే!

India vs West Indies 1st T20 : Virat Kohli Records, 23rd T20I Fifty || Oneindia Telugu
Just amazing: Vivian Richards in awe of Virat Kohli after India captain hits world record 23rd T20I fifty

హైదరాబాద్: ఉప్పల్‌ వేదికగా శుక్రవారం విండిస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బంతుల్లో 94; 6 ఫోర్లు, 6 సిక్సులు), ఓపెనర్ కేఎల్ రాహుల్(40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సులు) రాణించడంతో టీమిండియా మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది.

టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డులతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20ల్లో అత్యధిక సార్లు

టీ20ల్లో అత్యధిక సార్లు

టీ20ల్లో అత్యధిక సార్లు 50కిపైగా స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 68 ఇన్నింగ్స్‌లాడిన కోహ్లీ 23 సార్లు 50కిపైగా స్కోరు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (22) కొనసాగుతున్నాడు. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రెండో ఓవర్‌లో రాహుల్ మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు.

జట్టు స్కోరు 30 పరుగుల వద్ద

జట్టు స్కోరు 30 పరుగుల వద్ద

జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(8) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు.

చెత్త బంతులను బౌండరీలకు తరలించి

చెత్త బంతులను బౌండరీలకు తరలించి

చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలో రాహుల్ 37 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో లాంగ్ ఆఫ్‌లో పొలార్డ్ చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ (18) సిక్సర్‌తో ఖాతాతెరిచాడు.

24 బంతుల్లో 31

24 బంతుల్లో 31

చివర్లో సమీకరణం 24 బంతుల్లో 31కి చేరింది. ఈ దశలో మరోసారి నిర్లక్ష్యపు షాట్‌తో రిషబ్ పంత్ వికెట్ సమర్పించుకున్నాడు. పోలార్డ్ పట్టిన సూపర్ రిటర్న్ క్యాచ్‌కు అయ్యర్ (4) పెవిలియన్ చేరాడు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్లో 23 పరుగులు రావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ క్రమంలో కోహ్లీ టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించాడు.

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20ల్లో అత్యధిక ‘మ్యాన్‌ అఫ్‌ ది మ్యాచ్‌'లు గెలుచుకున్న ఆటగాడిగా అఫ్గాన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ (12 సార్లు) రికార్డును సమం చేశాడు. తర్వాతి స్థానంలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిదీ (11) ఉన్నాడు. కోహ్లీ ఆటతీరుపై వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్‌ కొనియాడాడు.

Story first published: Saturday, December 7, 2019, 12:04 [IST]
Other articles published on Dec 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+