For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ వీడియో చూసి సచిన్ శభాష్ అన్నాడు(వీడియో)

Junior Mohammad Kaif smashes through covers, Sachin Tendulkar loves it

హైదరాబాద్: సెలబ్రిటీలు మెచ్చుకోవడమంటే ఏదైనా గొప్ప విశేషముండే ఉంటుంది. అదే ఓ సెలబ్రిటి కొడుకుని మరో సెలబ్రిటీ మెచ్చుకోవడమంటే మామూలు విషయమా. చాలా గొప్ప విషయం అది అందరికీ మంచి టైమ్ పాస్ కూడా.

ఇదిగో ఇలాంటిదే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ కుమారుడు ఆడిన ఓ షాట్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా అయ్యాడు. స్మాష్‌ గేమింగ్‌ సెంటర్‌లో బౌలింగ్‌ మిషన్‌ సాయంతో జూనియర్‌ కైఫ్‌ ఆడిన కవర్స్‌ షాట్‌ వీడియోను మాస్టర్‌ ట్వీట్‌ చేశాడు.

'కవర్స్‌లో జూనియర్‌ కైఫ్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. వెల్‌డన్ ఎప్పుడూ.. ఇలానే ఆడుతూ ఉండూ..‌' అని ఈ బుడ్డోడిని అభినందనలు అందజేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. 1 లక్షా 82వేలకు పైగా వ్యూస్‌ రాగా రెండు వేల మంది రీట్వీట్‌ చేశారు. ఇరవై ఆరు వేల మంది లైక్ చేశారు. చూడండి మీరూ ఓసారి.

కైఫ్‌ సారథ్యంలో భారత్‌ 2000ల్లో అండర్‌-19 యూత్‌ ప్రపంచకప్‌ గెలిచింది. 37 ఏళ్ల కైఫ్‌ ఇప్పటి వరకు అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. రంజీ ట్రోఫీలో భాగంగా చత్తీస్‌ఘడ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తన చివరి వన్డేను దక్షిణాఫ్రికాతో 2006లో ఆడాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 30, 2017, 16:32 [IST]
Other articles published on Dec 30, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+