న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదేరోజు: 1983 లో వెస్టిండీస్ ను ఓడించి ప్రపంచకప్ ను గెల్చుకొన్న కపిల్ సేన

తొలిసారిగా వన్డే క్రికెట్ ప్రపంకప్ ను గెలుచుకొన్న రోజు ఇదే. 34 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు రెండుసార్లు ప్రపంచకప్ ను గెల్చుకొన్న వెస్టీండీస్ ను మట్టికరిపించి ఫైనల్లో విజయం.

By Narsimha

న్యూఢిల్లీ: తొలిసారిగా వన్డే క్రికెట్ ప్రపంకప్ ను గెలుచుకొన్న రోజు ఇదే. 34 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు రెండుసార్లు ప్రపంచకప్ ను గెల్చుకొన్న వెస్టీండీస్ ను మట్టికరిపించి ఫైనల్లో విజయం సాధించింది.

1983 జూన్ 25వ, తేదిన వెస్టీండీస్, ఇండియా జట్ల మద్య ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ పోటీ జరిగింది. ఈ పోటీలో భారత్ అద్భుత విజయం సాధించింది.అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ ను సాధించిన వెస్టీండీస్ ను భారత్ ఓడించడం ఆనాడు సంచలనమే.

June 25, 1983: Kapil's Tigers Upset Mighty Windies to Lift the World Cup

లండన్ లో లార్డ్స్ లో సరిగ్గా ఇదే రోజున వరల్డ్ కంప్ ఫైనల్ పోరు జరిగింది.43 పరుగుల తేడాతో వెస్టీండీస్ పై భారత్ విజయం సాధించింది. 54.4 ఓవర్లలో భారత్ 183 పరుగులకు అలౌటైంది. ఆనాడు 60 ఓవర్లు ఒక్కో జట్టు ఆడేవి. భారత జట్టుకు చెందిన కృష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులు, మోహిందర్ అమర్ నాథ్ 26 పరుగులు, యస్ పాల్ శర్మ 11, సందీప్ పాటిల్ 27 , కపిల్ దేవ్ 15 , మదన్ లాల్ 17, కిర్మాణి 14, గవాస్కర్ 2, రోజర్ బిన్నీ 2, కీర్తి ఆజాద్ లు సున్న పరుగులు చేశారు.

భారత్ కు 20 పరుగులు ఎక్స్ ట్రా ల రూపంలో వచ్చాయి. భారత్ అతి స్వల్పస్కోరును వెస్టీండీస్ ముందుంచింది. అయితే వెస్టీండీస్ చేతిలో ఓటమి తప్పదని భావించారు. అప్పటికే వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ ను అందుకొన్న వెస్టీండీస్ ఈ స్కోర్ ను అవలీలగా చేస్తోందని భావించారు.

అయితే అందరి అంచనాలను భారత్ తలకిందులు చేసింది. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాట్స్ మెన్ కుదేలయ్యారు. 52 ఓవర్లలో 140 పరుగులకే విండీస్ అలౌటైంది. మదన్ లాల్, అమర్ నాథ్ లు మూడేసీ వికెట్లను తీశారు. సందూకు రెండు వికెట్లు దక్కాయి. కపిల్ దేవ్, రోజర్ బిన్నీలు చెరో వికెట్ తీశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X