Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ను అవుట్ చేయాలని పాకిస్తాన్ బౌలర్ జునైద్ ఖాన్ ఆశ

Junaid Khan
కరాచీ‌: అనూహ్యంగా పాకిస్తాన్ ప్రపంచ కప్ జట్టులో చేరిన బౌలర్ జునైద్ ఖాన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయాలని ఆశపడుతున్నాడు. ఫిట్నెస్ కారణంగా జట్టు నుంచి సొహైల్ ఖాన్ జట్టు నుంచి తప్పుకోవడంతో 21 ఏళ్ల ఎడమ చేతి వాటం బౌలర్ జనైద్ ఖాన్‌కు స్థానం లభించింది. ప్రపంచ కప్ పోటీల్లో ఆడాలనే కల సాకారమైందని అతను అన్నాడు. భారత్‌పై జరిగే మ్యాచులో సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేసి అవుట్ చేయాలని ఉన్నట్లు జునైద్ తెలిపాడు. సచిన్‌ను అవుట్ చేయాలనేది తన కోరిక అని అతను చెప్పాడు.

సచిన్ టెండూల్కర్ మెరుపు బ్యాటింగ్ తనకు ఎంతో ఇష్టమని అతను చెప్పాడు. ఏ యువ బౌలర్‌కైనా సచిన్ వికెట్ గొప్ప బహుమతి అని తాను అనుకుంటున్నట్లు అతను తెలిపాడు. తాను పాకిస్తాన్ ఎ జట్టులో శ్రీలంకలో పర్యటించానని, అక్కడి పరిస్థితులు తనకు తెలుసునని అతను అన్నాడు. ప్రపంచ కప్ పోటీల్లో ఆడడానికి అవకాశం రావడం బోనస్ అని అతను అన్నాడు. తనకు ఆడే అవకాశం వస్తుందో రాదో తెలియదు గానీ అవకాశం వస్తే మాత్రం జట్టు యాజమాన్యాన్ని సంతృప్తి పరచగలననే నమ్మకం ఉందని అతను అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+