రూ.3వేల జరిమానా: ఆటగాళ్లకు కుంబ్లే హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఆటగాళ్లకు ఝలక్ ఇచ్చాడు! ఆటగాళ్ల ప్రాక్టీస్, శిక్షణతో పాటు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాక జరుగుతున్న విండీస్ టెస్ట్ సిరీస్‌ను సవాల్‌గా భావిస్తున్నాడు.
వెస్టిండీస్ టూర్లో ఉన్న టీమిండియా క్రమశిక్షణ పైన కుంబ్లే దృష్టి సారించాడు. బస చేసిన హోటల్ నుంచి టీం బస్ వద్దకు నిర్ణీత సమయంలో రావాలని సూచించాడు. ఎవరైనా ఆలస్యంగా బస్సు వద్దకు వస్తే రూ.3వేల జరిమానా చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించాడు.

ఆటగాళ్లు ఏ సమయంలోనైనా, ఏ సందేహాలు ఉన్నా తనతో నేరుగా మాట్లాడవచ్చునని చెప్పాడు. ఆటగాళ్లుక తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. వారికి క్రమశిక్షణతో పాటు స్వేచ్ఛను కూడా ఇస్తున్నాడు. ఆటగాళ్ల విషయంలో ఎలా ఉండాలో కుంబ్లేకు తెలుసునని చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications