Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం: అందరి దృష్టిని ఆకర్షించిన ఆ యువతి ఎవరో తెలిసింది

హైదరాబాద్: రెండు రోజుల ఐపీఎల్ వేలం ముగిసింది. ఐపీఎల్ 11వ సీజన్ కోసం బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్‌లో శని, ఆదివారాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కో ఓనర్, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా తన అందంతో వీక్షకులను కళ్లు తిప్పుకోకుండా చేసింది.

ఆటగాళ్ల కోసం పోటీ పడి మరీ బిడ్డింగ్ వేసిన ప్రీతి జింటా

ఆటగాళ్ల కోసం పోటీ పడి మరీ బిడ్డింగ్ వేసిన ప్రీతి జింటా

వేలంలో కీలక ఆటగాళ్లను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో మిగతా ఫ్రాంఛైజీలతో ప్రీతిజింటా పోటీపడి మరీ బిడ్డింగ్ వేసింది. ఈ క్రమంలో తొలిరోజు వేలం ముగిసిన తర్వాత ప్రీతి జింటాపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ వేదికగా సరదా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇంతకీ ఎవరా యువతి?

ఇంతకీ ఎవరా యువతి?

వేలంలో ప్రీతి జింటాతో పాటు మరో అమ్మాయి వీక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ప్రీతి జింటాతో పోటీ పడి మరీ ఆటగాళ్ల కోసం బిడ్డింగ్ వేసింది. దీంతో ఐపీఎల్ వేలాన్ని స్వయంగా వీక్షించిన వారు ఈ యువతి ఎవరా? అంటూ ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరా యువతి?

 జూహిచావ్లా, జై మెహతాల కుమార్తె జాన్వి మెహతా

జూహిచావ్లా, జై మెహతాల కుమార్తె జాన్వి మెహతా

బాలీవుడ్ నటి జూహిచావ్లా మనకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్‌తో పాటు ఆమె కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు కో ఓనర్‌గా ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున వేలంలో పాల్గొన్న ఈ యువతి మరోవరో కాదు జూహిచావ్లా, జై మెహతాల కుమార్తె జాన్వి మెహతా.

వేలంలో జూహిచావ్లాతో పాటు జాన్వి మెహతా కూడా

వేలంలో జూహిచావ్లాతో పాటు జాన్వి మెహతా కూడా

రెండు రోజుల పాటు బెంగళూరులో నిర్వహించిన వేలంలో ఆమెతో పాటు జాన్వి మెహతా కూడా పాల్గొంది. 17 సంవత్సరాల వయసున్న జాన్వి మెహతా ప్రస్తుతం లండన్‌లో విద్యనభ్యసిస్తోంది. ఇటీవలే ఇండియాకు వచ్చిన జాన్వి ఆమె తల్లితో కలిసి ఐపీఎల్‌ వేలంలో పాల్గొంది. వేలంలో మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ మరీ బిడ్డింగ్ వేసింది.

అతి పిన్న వయస్కురాలిగా జాన్వి రికార్డు

తద్వారా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దీంతో ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా జాన్వి రికార్డు సృష్టించింది. ఐపీఎల్ వేలం ముగిసిన అనంతరం మాట్లాడుతూ 'క్రిస్‌ లిన్‌ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పింది.

Story first published: Monday, January 29, 2018, 14:07 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+