Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎన్టీఆర్ నటించిన ఐపీఎల్ యాడ్‌ని చూశారా? (వీడియో)

ఎన్టీఆర్ నటించిన ఐపీఎల్ యాడ్‌ని చూశారా?
Jr NTR Vivo IPL 2018 advertisement out now

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌కు సంబంధించిన ఎన్టీఆర్ నటించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్‌కు తెలుగులో ఎన్టీఆర్‌ను స్టార్ మా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే.

స్టార్ మా ఆధ్వర్యంలో తెలుగులో వచ్చిన బిగ్‌బాస్ తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహారించడంతో ఈ షో సక్సెస్ అయింది. దీంతో స్టార్ మా ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ను మరోసారి ఉపయోగించుకొని తెలుగు అభిమానులకు ఐపీఎల్‌ను మరింత చేరువయ్యేలా చేసింది.

ఇందులో భాగంగా ఐపీఎల్ 11వ సీజన్‌కు ముందు ఎన్టీఆర్‌తో పలు టీవీ ప్రోమోలు షూట్ చేసి.. లీగ్ ఆరంభానికి ముందు వీటిని విడుదల చేసింది. ఈ టీవీ ప్రోమోలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఎన్టీఆర్‌తో పాటు పలువురు హాస్యనటులు నటించారు.

ఈ టీవీ ప్రోమోలో 'తొలుత RJ హేమంత్ వివో ఐపీఎల్ తెలుగులో వస్తుందని అంటాడు. ఆ తర్వాత ఇష్క్ మధు టీవీలో వస్తుంది కదురా, తెలుగులో ఏంటీ స్పెషల్ ఆంటాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తిరిగి అతడి వైపు చూస్తూ 'తెలుగులో అయితే ఏంటా? కారంలేని కోడి... ఉల్లిపాయలేని పకోడి... పెట్రోల్ లేని గాడీ... మీసాల్లేని రౌడీ... పరిగెత్తడం రాని కేడీ... ఆవకాయ లేని జాడీ... ఆటల్లేని బడి... అమ్మ ప్రేమలేని బడి' అని అంటాడు.

దీంతో ఇష్క్ మధు ఎన్టీఆర్‌కు చాలురా బాబూ అంటూ నమస్కారం పెడతాడు. ఒప్పేసుకున్నాం అని అంటాడు. దీంతో ఎన్టీఆర్ అసలు మాజా తెలుగులోనే అంటూ ఎన్టీఆర్ చెప్పడంతో వీడియో ముగుస్తుంది. ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ ప్రోమోలను స్టార్ మాలో ప్రసారం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఏప్రిల్ 7న నిర్వహించనున్నారు. ఆరంభ వేడుకల అనంతరం డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఆరంభ వేడుకలకు ఎనిమిది జట్లకు చెందిన కెప్టెన్లు హాజరు కావడం లేదు.

Story first published: Tuesday, April 3, 2018, 16:20 [IST]
Other articles published on Apr 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+