Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఫేవరేట్ క్రికెటర్ ఆయనే, నా కొడుక్కి క్రికెట్ నేర్పిస్తా: తెలుగులో ఐపీఎల్‌పై ఎన్టీఆర్

Jr NTR As Brand Ambassador For IPL Telugu
Jr NTR Press Conference On IPL 2018

హైదరాబాద్: తన ఫేవరేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పుకొచ్చారు జూ. ఎన్టీఆర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌కు గాను తెలుగులో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో స్టార్ మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ 'ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో స్టార్ మాతో అసోసియేషన్ పట్ల సంతోషంగా ఉన్నా. దీనిని ఒక కుటుంబం లాగా భావిస్తున్నా. ఐపీఎల్ తెలుగు రీచ్ అవుతుందని, అసలు మజా తెలుగులోనే ఉంటుంది' అని అన్నారు.

ఫేవరేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్

ఫేవరేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్

మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు అన్న ప్రశ్నకు గాను 'చాలా మంది గొప్ప క్రికెటర్లు ఉన్నారని, వారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. తనకు క్రికెట్ గురించి అవగాహన వస్తోన్న వయసులో సచిన్ టెండూల్కర్ మాత్రమే తెలుసని, ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇష్టం. అయితే సచిన్ ఎప్పటికీ సచినే' అని అన్నారు.

ఆట కూడా ఒక భాష

ఆట కూడా ఒక భాష

'ఆట కూడా ఒక భాష అని నా అభిప్రాయమని, సరిహద్దులు లేని ఆట క్రికెట్. తన సింహాద్రి సినిమా పెద్ద హిట్ కాగానే తనకు సిక్స్ కొట్టినట్లు అనిపించిందని అన్నారు. సినిమాల్లో డకౌట్లయిన (ప్లాప్స్) సందర్భాలు కూడా ఉన్నాయని, గెలుపు, ఓటములు సాధారణమే' అని అన్నారు.

ఐపీఎల్ ఒక కొత్త డైమన్షన్‌ని క్రియేట్ చేసింది

ఐపీఎల్ ఒక కొత్త డైమన్షన్‌ని క్రియేట్ చేసింది

'క్రికెట్లో ఐపీఎల్ ఒక కొత్త డైమన్షన్‌ని క్రియేట్ చేసింది. అలాంటి ఒక కొత్త డైమన్షన్‌కి తెలుగుభాషలో దాని కామెంట్రీ చేస్తే, స్టార్ మా మూవీస్‌లో దాన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకున్నందుకు నిజంగా స్టార్ ఇండియా వారికి నా కృతజ్ఞతలు. నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని అన్నారు.

క్రీడలు ఒక లాంగ్వేజ్‌లాగా పనికొస్తాయి

క్రీడలు ఒక లాంగ్వేజ్‌లాగా పనికొస్తాయి

'క్రికెట్‌ను ఆస్తి లాగా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారు. క్రీడలు ఒక లాంగ్వేజ్‌లాగా కూడా పనికొస్తాయి. తల్లిదండ్రులు పిల్లలమీద ఒత్తిడి తీసుకురావద్దు. క్రీడల ద్వారానే ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోగలుగుతున్నారు. భారత దేశంలో క్రీడలపట్ల ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నారు.

క్రికెట్ మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకుపోయింది

క్రికెట్ మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకుపోయింది

'ముఖ్యంగా క్రికెట్ మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకుపోయింది. తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌ పట్ల ప్రేమను కూడా మనకు వారసత్వంగా పంచారని గట్టిగా నమ్ముతాను. మా నాన్న ఎంతో ఇష్టంగా క్రికెట్‌ను చూసేవారు. ఆయన చూడటం దగ్గర నుంచి నేను క్రికెట్ పట్ల ఆ ప్రేమను పెంచుకోవడం జరిగింది' అని అన్నారు.

నా కొడుకు క్రికెటర్ అయితే అంగీకరిస్తా

నా కొడుకు క్రికెటర్ అయితే అంగీకరిస్తా

'నేను హీరో కావాలని అమ్మా నాన్న అనుకోలేదు. నేను నా కొడుకుకి వారసత్వంగా క్రికెట్ పట్ల ప్రేమను పెంచుతా. నా కొడుకు క్రికెటర్ అయితే అంగీకరిస్తా. అతడి ఇష్టం ప్రకారం వెళ్లనిస్తా. సినిమాలు చేసేటప్పుడు గెలుపుఓటములకు అతీతంగా వెళ్లిపోతుంటాం. క్రికెటర్ల జీవితాలు తెరపై రావడం ఆనందంగా ఉంది. వారి బయోపిక్స్‌ చేయడానికి నేను సాహసించను. రాజమౌళి ఇంకా కథ పూర్తిగా చెప్పలేదు, సినిమాకు సిద్ధం కావాలన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు' అని ఎన్టీఆర్ అన్నారు. కాగా, తొలిసారి స్టార్ స్పోర్ట్స్‌లో తెలుగు కామెంటరీతో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.

యాడ్‌ను విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్

ఐపీఎల్‌ను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ నెట్‌వర్క్ తెలుగులో ఓ యాడ్‌ను విడుదల చేసింది. స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ ఖాతా ద్వారా ఎన్టీఆర్ నటించిన ప్రోమోను విడుదల చేసింది. ఎన్టీఆర్ కొత్త లుక్‌లో సింపుల్‌గా డైలాగ్స్ చెప్పారు. ఇందులో టాలీవుడ్‌కు చెందిన సహాయ నటులు ఉన్నారు.

Story first published: Tuesday, April 3, 2018, 18:00 [IST]
Other articles published on Apr 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+