
ఎన్టీఆర్‌తో పాటు మిగతా తారలు:
అత్యంత ధనిక దేశీవాలీ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌కు కెప్టెన్లు లోటు ప్రభావితం చూపుతుందనుకున్నారో.. లేదా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందనే ఉద్దేశ్యంతో.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీ ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. రణవీర్‌సింగ్, పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.

వేడుకకు దూరమైన కెప్టెన్లు:
మరి వేడుకకు దూరమైన కెప్టెన్ల వివరాలిలా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరు (విరాట్ కోహ్లీ), రాజస్థాన్ రాయల్స్ (స్టీవెన్ స్మిత్), ఢిల్లీ డేర్ డెవిల్స్ (గౌతం గంభీర్), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఆర్ అశ్విన్), కోల్‌కత్తా నైట్‌రైడర్స్ (దినేశ్ కార్తీక్), సన్ రైజర్స్ హైదరాబాద్ (కేన్ విలియమ్సన్) కొన్ని ఇతరేతర కారణాల వల్ల ఈ వేడుకకు దూరం కానున్నారు.

ఇద్దరే కెప్టెన్లే:
ఎనిమిది ఫ్రాంచైజీల నుంచి ఇప్పటికే ఇద్దరే కెప్టెన్లే అందుబాటులో ఉండనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు చెందిన మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు మినహాయించి మిగిలిన ఆరు కెప్టెన్లు గైర్హాజరుకానున్నారు. సమయాబావం ప్రత్యేక కారణాల రీత్యా వారంతా దూరం కానున్నారని సమాచారం.

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కూడా:
వీరితో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ 10సీజన్ ప్రారంభోత్సవానికి ఎనిమిది జట్లు కెప్టెన్లు హాజరై వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు వీరి స్థానాలను సినీ తారలు భర్తీ చేయనున్నారు.


Click it and Unblock the Notifications
