Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు జెపి డుమిని వీడ్కోలు

JP Duminy retires from all forms of the game

హైదరాబాద్: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ జీన్‌ పాల్‌ డుమిని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న 35 ఏళ్ల డుమిని.. ఆ తర్వాత ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడుతూ అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా, ఇప్పడు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు.

2004, ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుమిని సఫారీ జట్టు తరుఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. సఫారీ జట్టు మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌‌మెన్‌గా గుర్తింపు పొందాడు. కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభిస్తానని తెలిపాడు.

"నాలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. టీ20 మ్యాచ్‌లు ఆడితే ఫ్రాంఛైజీలు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇస్తాయి. అయితే, అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ల కోసం నేను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా" అని జెపి డుమిని అన్నాడు.

Story first published: Tuesday, January 14, 2020, 12:32 [IST]
Other articles published on Jan 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+