వరల్డ్‌కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్న జేపీ డుమిని

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల నుంచి వైదొలగబోతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ స్పష్టం చేశాడు. వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ... టీ20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని పేర్కొన్నాడు. 2017లో టెస్టు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డుమిని తాజాగా వన్డే ఫార్మాట్ నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సందర్భంగా డుమిని మాట్లాడుతూ "గత కొన్నినెలలుగా నా వన్డే రిటైర్మెంట్‌పై ఆలోచనలో పడ్డా. వన్డేలకు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని బలంగా నమ్ముతున్నా. వరల్డ్‌కప్ తర్వాత తప్పుకోవడానికి సిద్ధమయ్యా. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సతమతమయ్యా. కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అంతర్జాతీయ, దేశవాళీ టీ20ల్లో కొనసాగుతా" అని డుమిని తెలిపాడు.
న్యూలాండ్స్ వేదికగా శ్రీలంకతో ఆఖరిదైన ఐదో వన్డే శనివారం జరగనుంది. స్వదేశంలో డుమినికిదే ఆఖరి వన్డే కావడం విశేషం. గతంలో 2011, 2015 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన డుమిని మూడోసారి బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటివరకూ డుమినీ 193 వన్డేలు ఆడగా 37. 39 సగటుతో 5,047 పరుగులు చేశాడు.
ఇక బౌలింగ్‌లో 68 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే 2019 ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం జేపీ డుమినిని విడుదల చేసింది. వేలంలో అతన్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు అందుబాటులో డుమిని ఉండనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications