Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ.. సిరీస్ కు దూరమైన హేజిల్ వుడ్..!

ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌కు లెజెండరీ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ దూరమైనట్లు తెలుస్తోంది.
గబ్బా టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా జోష్ హేజిల్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. రోజు కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో కాలు పిక్కలు పట్టేయడంతో మైదానాన్ని విడాడు. అతడిని స్కానింగ్ కు పంపించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ పేర్కొంది. ఈ మ్యాచ్ లోకోహ్లీ వికెట్ తిశాడు.

హేజిల్ వుడ్ దూరమైతే.. ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా హాజిల్‌వుడ్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ను కోల్పోవడం ఆస్ట్రేలియా వ్యూహంపై ప్రభావం చూపనుంది. హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియాకు కీలకమైన బౌలర్‌లలో ఒకడు. అతనికి ప్రత్యామ్నయంగా స్కాట్ బోలాండ్ ను తీసుకునే అవకాశం ఉంది. బ్రిస్బేన్‌లో తరచూ వర్షం కురుస్తున్న సమయంలో ఆస్ట్రేలియా విజయం సాధించేందుకు ప్రయత్నించింది.

Josh Hazlewood likely to miss Border-Gavaskar Trophy 2024-25 series

హేజిల్‌వుడ్ గైర్హాజరీలో పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్ ఎక్కువగా బౌలింగ్ చేశాడు. హేజిల్‌వుడ్ 2021-22లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో రాణించి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. గబ్బా మ్యాచ్ లో హేజిల్ వుడ్ ఈ మ్యాచ్ లో ఆరు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు.
హేజిల్‌వుడ్ ఇంతకు ముందు స్కాట్లాండ్ ఇంగ్లండ్‌తో జరిగిన T20Iలకు దూరమయ్యాడు. ప్యాట్ కమ్మిన్స్ 4 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడకొట్టాడు.

మిగతా మ్యాచ్ లకు హేజిల్ వుడ్ దూరం కావడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీ ఎక్కువగా హేజిల్ వుడ్ బౌలింగ్ ఔటయ్యాడు. మిగతా రెండు మ్యాచ్ ల్లో హేజిల్ వుడ్ ఉండకపోవచ్చని వార్తలు వస్తుండడంతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Story first published: Tuesday, December 17, 2024, 17:40 [IST]
Other articles published on Dec 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+