For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మన్‌.. ప్రభావం చూపని బౌలర్లు!! డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం!!

Josh Hazlewood, Joe Burns shine Australia thrash India in Pink-ball Test

అడిలైడ్‌: అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు (డే/నైట్) మూడున్నర రోజుల్లోనే ముగిసింది. టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో.. ఆసీస్‌ సునాయాస విజయం సాధించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 90 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మాథ్యూ వేడ్ ‌(33) ఆకట్టుకోగా.. జో బర్న్స్ ‌(51) హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది.

19 పరుగులకే 6 వికెట్లు:

19 పరుగులకే 6 వికెట్లు:

మూడో రోజైన శనివారం 9/1తో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన టీమిండియా 36/9కే పరిమితమైంది. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా (2: 17 బంతుల్లో) ఈరోజు ఆరంభంలోనే పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో అతనికే సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత జోష్ హేజ‌ల్‌వుడ్‌ కూడా చెలరేగడంతో ఇండియ‌న్ టాప్ ఆర్డ‌ర్‌ కుప్పకూలింది. ఈ ఇద్దరూ నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. భార‌త బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టారు. దీంతో చతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లీ (4), అజింక్య రహానె (0), మయాంక్ అగర్వాల్ (9: 40 బంతుల్లో 1x4) వరుస ఓవర్లలో ఔటయ్యారు. దీంతో 19 పరుగులకే కీలక 6 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

 రెండంకెల స్కోర్ లేదు:

రెండంకెల స్కోర్ లేదు:

ఆపై ఆదుకుంటారనుకున్న వృద్ధిమాన్ సాహా (4), హనుమ విహారి (8) కూడా ఔట్ అవ్వడంతో భారత్ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. ఆర్ అశ్విన్ (0), ఉమేష్ యాదవ్ (4) కూడా త్వరగానే ఔట్ అయ్యారు. చివరికి మహ్మద్‌ షమీ (1) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది. హాజిల్‌వుడ్‌ 5/8, కమిన్స్‌ 4/21 నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పేక మేడలా కూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ నమోదు చేయలేదు.

బర్న్స్ ఫిఫ్టీ:

బర్న్స్ ఫిఫ్టీ:

స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ వేడ్ (33: 53 బంతుల్లో 5x4), జో బర్న్స్ (51 నాటౌట్: 63 బంతుల్లో 7x4, 1X6) దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ వేడ్ రనౌటవగా.. ఆ తర్వాత వచ్చిన మార్కస్ లబుషేన్ (6: 10 బంతుల్లో) అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి అగర్వాల్ చేతికి చిక్కాడు. అనంతరం వచ్చిన స్టీవ్ స్మిత్ (1 నాటౌట్)‌తో కలిసి జో బర్న్స్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

స్కోరు బోర్డు వివరాలు:

స్కోరు బోర్డు వివరాలు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 244 ఆలౌట్‌; కోహ్లీ 74, పుజారా 43 పరుగులు; స్టార్క్‌ 4 వికెట్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌; టిమ్‌పైన్‌ 73, లబుషేన్‌ 47 పరుగులు; అశ్విన్‌ 4 వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 36/9; మయాంక్‌ 9, విహారి 8 పరుగులు; హాజిల్‌వుడ్‌ 5 వికెట్లు

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 93/2; జో బర్న్స్‌ 51*, మాథ్యూవేడ్‌ 33; అశ్విన్‌ 1 వికెట్‌

మహ్మద్‌ షమీ రిటైర్డ్‌ హర్ట్‌ కాదు.. రిటైర్డ్‌ ఔట్!! క్రికెట్‌ చరిత్రలో ఇది మూడోసారే!

https://telugu.mykhel.com/cricket/india-vs-australia-mohammed-shami-not-retires-hurt-its-retires-out-032184.html

Story first published: Saturday, December 19, 2020, 14:15 [IST]
Other articles published on Dec 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+