క్రికెట్‌లో అద్భుతం: ఒకే ఇన్నింగ్స్‌లో 40 సిక్సులు బాది ట్రిపుల్ సెంచరీ
హైదరాబాద్: ఆస్ట్రేలియాకు చెందిన ఓ బీ గ్రేడ్ క్రికెటర్ ఒక ఇన్నింగ్స్‌లో 40 సిక్సులు బాది ట్రిపుల్ సెంచరీ చేశాడు. వెస్ట్ ఆగస్టాకు చెందిన బీ గ్రేడ్ బ్యాట్స్‌మన్ జోష్ డన్‌స్టాన్ ఈ ఘనత సాధించాడు. 35 ఓవర్ల పాటు జరిగిన మ్యాచ్‌లో డన్‌స్టాన్ ఒక్కడే 40 సిక్సర్లు బాదడం విశేషం.
జట్టు మొత్తం స్కోరు 354 కాగా, అందులో డన్ స్టాన్ స్కోరు 307. అంటే జట్టు మొత్తం స్కోరులో 86.72 శాతం పరుగులు డన్‌స్టానే సాధించాడు. అంతకముందు ఈ రికార్డు వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ పేరిట ఉంది. 1984లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిచర్డ్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 272 పరుగులు చేయగా, అందులో వివ్ రిచర్డ్స్ 189 పరుగులు చేశాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో వివ్ రిచర్డ్స్ 69.48 శాతం పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో డన్ స్టాన్ జట్టులో ఐదుగురు డకౌట్ అయ్యారు. డన్‌స్టాన్ తర్వాత జట్టులో రెండో అత్యధిక స్కోరు 18.
బెన్ రస్సెల్‌తో కలిసి డన్ స్టాన్ ఏడో వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రస్సెల్ మాత్రం ఐదు పరుగులే చేయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications