న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అచ్చం అతడిలాగే!: హుందాగా సెల్యూట్‌తో స్లెడ్జ్ చేసిన బట్లర్ (వీడియో)

Buttler Trolls Cottrell With Salute After Hitting Him For Six | Oneindia Telugu
Jos Buttler Wallops Sheldon Cottrell For Six, Gives Him A Salute - Watch

హైదరాబాద్: సెయింట్‌ జార్జియా జార్జియా వేదకగా బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ 77 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు సాధించాడు. వన్డేల్లో బట్లర్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

ఐపీఎల్ 2019: నీ కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా?: బుమ్రాతో కోహ్లీ (వీడియో)ఐపీఎల్ 2019: నీ కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా?: బుమ్రాతో కోహ్లీ (వీడియో)

హాఫ్ సెంచరీ తర్వాత కేవలం 15 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. విండిస్ బౌలర్ షెల్డన్‌ కార్టెల్‌ను జోస్ బట్లర్ సిక్సర్‌ బాది మరీ స్లెడ్జ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండిస్ బౌలర్లను ఓ ఆటాడుకున్న బట్లర్... కార్టెల్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టాడు.

దాంతో బట్లర్‌ వైపు తదేకంగా చూడసాగాడు కాట్రెల్‌. దీంతో తనవైపే తదేకంగా చూస్తోన్న కార్టెల్‌కు నవ్వుతూ సెల్యూట్‌ చేశాడు. కార్టెల్‌ ఎప్పుడు వికెట్లు తీసినా ఇలాగే సెల్యూట్‌ చేస్తాడు. ఇప్పుడు బట్లర్‌ సైతం అలాగే చేయడంతో మైదానంలో నవ్వులు పూశాయి. బట్లర్‌ ఎంతో హుందాగా కార్టెల్‌ను స్లెడ్జింగ్‌ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ (73 బంతుల్లో 82; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్‌ (77 బంతుల్లో 150; 13 ఫోర్లు, 12 సిక్స్‌లు), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడాడు.

జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ఫలితంగా ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ మొత్తం 24 సిక్స్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఓ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా నిలిచింది.

ఇదే సిరీస్‌‌లో తొలి వన్డేలో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ నెలకొల్పిన 23 సిక్స్‌ల రికార్డును అధిగమించారు. వన్డేల్లో 400పై స్కోరు సాధించడం ఇంగ్లాండ్‌కు ఇది నాలుగోసారి. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ గెలవగా, రెండో వన్డేలో విండిస్ విజయం సాధించింది. వర్షం కారణంగా మూడో వన్డే రద్దయ్యింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే శనివారం జరుగనుంది.

Story first published: Thursday, February 28, 2019, 16:37 [IST]
Other articles published on Feb 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X