Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG VS AUS:'బాధగా ఉంది.. అలా చేయలేకపోవడమే మా ఓటమికి కారణం!' - జోస్ బట్లర్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తాజాగా జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రెండు జట్లూ రికార్డ్ స్కోర్లతో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ చివరికి విజయం ఆస్ట్రేలియాకే దక్కింది. దీంతో ఆస్ట్రేలియాపై ప్రశంసలు కురిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, తమ జట్టు ఆటగాళ్ల కూడా అద్భుతంగా ఆడారాని కొనియాడాడు. కానీ అద్భుతంగా ఆడినప్పటికీ తమ జట్టు ఓడిపోవడం కాస్త బాధగా అనిపించిందని అన్నాడు. దీంతో పాటే ఓటమికి గల కారణాలను మాట్లాడాడు.

రెండు జట్లూ అద్భుతం..
"అద్భుతమైన మ్యాచ్. రెండు జట్లు మంచి ప్రదర్శన చేశాయి. మేము మంచి స్కోర్ చేశాం. కానీ ఆస్ట్రేలియాకే క్రెడిట్ దక్కుతుంది. జోష్ ఇంగ్లీస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 350.. మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. చాలా పెద్ద స్కోరు ఇది. కాకపోతే పిచ్ పై తేమ, తడి ఉండటం కాస్త ఇబ్బందికరమైన విషయం. పిచ్ పరిస్థితుల వల్ల ఏదీ జరిగినప్పటికీ, 350ని ఛేదించడం అద్భుతమైన విషయం."

Jos Buttler says the reasons for loss against australia in champions trophy ENG VS AUS match

కానీ కాస్త బాధ..
"డకెట్ సూపర్ గా ఆడాడు. అన్ని ఫార్మాట్లలో టాప్ ఆర్డర్‌లో బాగా రాణిస్తున్నాడు. నిలకడగా ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఇంత మంచిగా ఆడి ఓడటం కాస్త బాధకరమైన విషయం. వ్యక్తిగత కన్నా భాగస్వామ్యాలు నమోదు చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. రూట్, డకెట్ అదే చేశారు. ఇంకా రూట్, లివింగ్‌స్టోన్ బాగా బాగా బౌలింగ్ చేశారు. వారు అవకాశాలను సృష్టించుకున్నారు. మేం ఇంగ్లీస్, క్యారి భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి ప్రయత్నించాం. కానీ దానిని మేనేజ్ చేయలేకపోయాం. కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది." అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, February 23, 2025, 8:08 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+