Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నా.. బట్లర్ ఈజ్ బ్యాక్, ఆసీస్ సిరీస్లో ఆడతానన్న జోస్

jos Buttler Says He is Fit and Ready for T20 Worldcup, He Recovered from Calf Injury

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తాను గాయం నుంచి కోలుకుని 100శాతం ఫిట్‌గా ఉన్నానని.. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరగబోయే 3 టీ20ల మ్యాచ్‌ల సిరీస్‌‌లో తాను ఆడనున్నట్లు చెప్పాడు. అక్టోబర్ 9నుంచి 14వరకు మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచ‌కప్‌ మొదలుకానున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్‌కు ఇదే చివరి టీ20 సిరీస్. కాఫ్ గాయం కారణంగా.. పాకిస్థాన్‌తో ఇటీవల జరిగిన ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్లో బట్లర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

అయినప్పటికీ అతను జట్టుతో కలిసి పాకిస్థాన్ వెళ్లాడు. ఆ సిరీస్లో ఇంగ్లాండ్ 4-3తేడాతో గెలుపొందింది. జోస్ బట్లర్ గైర్హాజరీలో మొయిన్ అలీ ఇంగ్లాండ్‌కు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బట్లర్ పాకిస్థాన్‌లో సిరీస్ టైంలో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఇక ఆసీస్ సిరీస్ ముందు బట్లర్ మాట్లాడుతూ.. తన గాయం పట్ల చాలా కాషియస్‌గా ఉన్నానని, వీలైనంత జాగ్రత్తగా ఉంటానని, ప్రపంచ‌కప్‌కు ముందు తన కమ్ బ్యాక్‌లో తొందరపడబోనని చెప్పాడు.

'నేను 100శాతం గాయం నుంచి కోలుకున్నాను. పాకిస్తాన్లో నా రిహబిలిటేషన్ టైం బాగా గడిచింది. నేను కోలుకున్నాను కాబట్టి ప్రపంచ‌కప్‌కు ముందుగానే నేను ఆడడానికి వీలవుతుంది. అక్టోబరు 12, 14వ తేదీల్లో కాన్‌బెర్రాలో జరిగే చివరి రెండు టీ20లకు ఆడాలనుకుంటున్నా. అక్టోబర్ 9న పెర్త్‌లో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో మాత్రం తాను ఆడతాడో లేదో మాత్రం చెప్పలేను' అని బట్లర్ పేర్కొన్నాడు. బట్లర్ పునరాగమనం ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఉత్సాహాన్నిస్తుంది. అయితే ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలే అవకాశముంది. స్టార్ ఆల్రౌండర్ అయిన లియామ్ లివింగ్‌స్టోన్ గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. టీ20ల్లో ప్రమాదకరమైన హిట్టర్‌లలో ఒకరిగా లివింగ్‌స్టోన్ కొన్నాళ్లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో ది హండ్రెడ్ టోర్నీలో చీలమండ గాయం కారణంగా అతను టీ20లకు దూరమయ్యాడు.

'అతను గాయంతో కోలుకుంటున్నాడు. అతను తిరిగి వచ్చే వీలుంది' అని బట్లర్ లివింగ్ స్టోన్ పునరాగమనంపై చెప్పాడు. ఇకపోతే బట్లర్ ప్లేయింగ్ లెవెన్లోకి తిరిగి వస్తే.. అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్‌లలో ఎవరో ఒకరు ఓపెనింగ్ స్లాట్ల నుంచి వైదొలుగుతారు. పాకిస్థాన్‌లో మా ప్లేయర్లు మంచి ఫామ్ కనబరిచారు. వారిద్దరూ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. నేను వారిద్దరిలో ఎవరితో ఓపెనింగ్ దిగినా మా బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏం ప్రాబ్లమ్ ఉండదు' అని బట్లర్ చెప్పాడు.

Story first published: Saturday, October 8, 2022, 14:12 [IST]
Other articles published on Oct 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+