Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జోస్ బట్లర్ 'ర్యాంప్ షాట్' చూశారా? (వీడియో)

Jos Buttler's Stunning 'Ramp Shot' in BBL Has Everyone Talking

హైదరాబాద్: క్రికెట్ ఆటగాళ్లలో ఉన్న కళాత్మక షాట్లను వెలికితీసే క్రీడ. టెక్నిక్ పరంగా ఒక్కో ఆటగాడు ఒక్కోలా ఆడుతుంటాడు. తాజాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ర్యాంప్ షాట్లతో హోరెత్తించే ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి తన కళాత్మక షాట్‌ ఆడాడు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ర్యాంప్‌ షాట్‌తో అభిమానులను అలరించాడు. సిడ్నీ థండర్స్ తరఫున బరిలోకి దిగిన బట్లర్ (81: 43 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సులు) సాయంతో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

అయితే ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రత్యర్థి హోబర్ట్ హరికేన్స్ జట్టు నిర్దేశించిన 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ గెలుపు అంచుల వరకు బట్లర్ తీసుకెళ్లాడు. అయితే జట్టు స్కోరు 167 వద్ద అనూహ్యంగా రనౌటయ్యాడు.

దీంతో సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 180/8కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లాండ్ ఆటగాడు, హోబర్ట్ జట్టు బౌలర్ మిల్స్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బట్లర్ బాదిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆఫ్‌స్టంప్‌కి దూరంగా విసిరిన బంతిని.. వైడ్‌ లైన్‌పై పడిపోతూ ర్యాంప్ షాట్ ఆడాడు.

ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ సిక్సర్‌కి అభిమానులు ముగ్ధులయ్యారు. ఇదే ఓవర్‌లో మరో సిక్సర్‌ కూడా బాదిన జోస్ బట్లర్.. జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు.

Story first published: Wednesday, January 3, 2018, 9:51 [IST]
Other articles published on Jan 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+