Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Netherlands vs England: విశ్వరూపం చూపించిన బట్లర్, ఇంగ్లాండ్ బ్యాటర్ల దెబ్బకు వరల్డ్ రికార్డ్ బద్ధలు

Jos Buttlers Second Fastest hundred for England helps to Break Highest Innings Total in ODIs

స్టోక్స్, బెయిర్ స్టో లాంటి హిట్టర్లు లేకుండానే నెదర్లాండ్ పర్యటనకు మోర్గన్ కెప్టెన్సీలో వెళ్లిన ఇంగ్లాండ్ టీం పాపం పసికూన లాంటి నెదర్లాండ్స్‌ను ఓ ఆటాడుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆమ్‌స్టెల్‌వీన్‌లోని వీఆర్ఏ గ్రౌండ్‌లో జరుగుతున్న మొదటి వన్డేలో నెదర్లాండ్స్‌‌పై ఇంగ్లాండ్ క్రూరాతి క్రూరంగా బ్యాటింగ్ చేసింది. ఆడేటోళ్లకు దమ్ముకొచ్చిందో లేదో కానీ చూసేటోళ్లకు మాత్రం ఇవేం సిక్సులు, ఫోర్లు అంటూ దమ్ముకొచ్చేలా ఇంగ్లాండ్ బ్యాటర్లు అరివీర భయంకరంగా బ్యాటింగ్ చేశారు. వన్డే ఫార్మాట్ అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారేమో ఏకంగా ఈ మ్యాచ్‌లో 26 సిక్సులు, 36ఫోర్లతో దడదడలాడించారు. ఇక ఈ మ్యాచ్‌లో 50ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ 498పరుగులు చేసింది. తద్వారా వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా తన రికార్డును తానే ఇంగ్లాండ్ బద్ధలు కొట్టింది. అంతకుముందు ఆస్ట్రేలియాపై నాటింగ్ హమ్ వేదికగా ఇంగ్లాండ్ 481పరుగులు చేసింది.

ఆదిలోనే ఇంగ్లాండ్‌కు ఎదురు దెబ్బ తగిలినా

ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇకపోతే టీ20ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ రెండుసార్లు ఇంగ్లాండ్‌ను ఓడించడం గమనార్హం. ఇక చాలా రోజుల తర్వాత ఇంగ్లాండ్ టీం నెదర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతుండడంతో ఈ మ్యాచ్ విషయమై ఆసక్తి నెలకొంది. ఇక బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. 1 పరుగుకే ఆ జట్టు స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్‌తో కలిసి డేవిడ్ మలన్ రెండో వికెట్‌కు 221పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక వీరిరువురు అడపాదడపా సిక్సులు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

సాల్ట్ మెయిడెన్ సెంచరీ, అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా మలన్

ఈ క్రమంలో ఫిలిప్ సాల్ట్ (122పరుగులు 93బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) తన తొలి వన్డే సెంచరీ నమోదు చేసి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. మలన్‌తో కలిసి బట్లర్ మూడో వికెట్‌కు 184పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. బట్లర్ క్రీజులో కుదురుకున్న కాసేపటి నుంచి తన దండయాత్రను మొదలెట్టాడు. ఐపీఎల్ తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్లో కొనసాగించిన తన భీకర ఫామ్‌‌ను మళ్లీ కొనసాగించాడు. ఇక మలన్ (125పరుగులు 109బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు జోస్ బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఇక మల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మోర్గాన్ డకౌట్ అయ్యాడు.

జోస్ బట్లర్ విధ్వంస కాండ, లివింగ్ స్టన్నింగ్ ఇన్నింగ్స్

ఇక ఆ తర్వాత బరిలోకి దిగిన లియామ్ లివింగ్ స్టన్.. ఐపీఎల్లో రాణించిన తన ఫాంను కొనసాగిస్తూ.. వీరవిహారం చేశాడు. మరో పక్క బట్లర్ నెదర్లాండ్ బౌలర్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తుంటే.. లివింగ్ స్టన్ తుత్తునియలు చేస్తూ ఆడాడు. వీరిద్దరు 32 బంత్లు 91పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక 47బంతుల్లోనే సెంచరీ చేసుకున్న బట్లర్ ఇంగ్లాండ్ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక సెంచరీ అనంతరం బట్లర్ ఎదుర్కొన్న బట్లర్ 23బంతుల్లో 62పరుగులు చేశాడు. ఇక బట్లర్ (162పరుగులు 70బంతుల్లో 7ఫోర్లు, 14సిక్సులు నాటౌట్)తో కడవరకు విధ్వంసకాండ రచించగా.. చివర్లో లివింగ్ స్టన్ (66పరుగులు 22బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్)తో బీభత్సం రేపాడు.

స్కోరు సమ్మరీ

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ - 50ఓవర్లకు 498 / 4

ఫిలిప్ సాల్ట్ (122), డేవిడ్ మలన్ (125), జోస్ బట్లర్ (162నాటౌట్), లియమ్ లివింగ్ స్టోన్ (66నాటౌట్)

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ - 7ఓవర్లకు 36 /1

Story first published: Friday, June 17, 2022, 20:17 [IST]
Other articles published on Jun 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+