ENG vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్-బీలో జరిగిన చాలా ముఖ్యమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ప్రశ్నార్థకంగా మారింది. జోస్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు ఈ ఏడాది 10 మ్యాచ్ ల్లో 9 మ్యాచ్ లు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీకి సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి రౌండ్ లోనే ఓడిపోవడం చాలా నిరాశపరిచిందని అన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని.. కానీ మేము మా అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదన్నాడు. రూట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని.. కానీ మా జట్టులోని టాప్ 6 ఆటగాళ్లలో ఎవరూ అతనికి మద్దతు ఇవ్వలేదని అని అన్నాడు. తాము బౌలింగ్ చేసిన చివరి పది ఓవర్లలో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చామని.. అదే మా ఓటమికి కారణమని జోస్ బట్లర్ స్పష్టం చేశాడు.

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ కు బట్లర్ అభినందనలు తెలిపారు. అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ ను చాలా ఒత్తిడిలోకి నెట్టాడని బట్లర్ చెప్పుకొచ్చాడు. చివరి 10 ఓవర్లలో 113 పరుగులు ఇవ్వడం చెడ్డ విషయం అని తాను భావిస్తున్నానని చెప్పాడు. అలా ఆఫ్ఘన్ జట్టు ఈ పిచ్ పై మంచి స్కోరు సాధించిందన్నాడు. అదే విధంగా మార్క్ వుడ్ గాయపడ్డాడని.. అయితే గాయం ఉన్నప్పటికీ అలాగే బౌలింగ్ చేస్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. మార్క్ వుడ్ లేకపోవడంతో చివరి ఓవర్లు బౌలింగ్ చేయడానికి స్పిన్ బౌలర్లను ఉపయోగించామన్నారు. లివింగ్‌స్టోన్ కూడా గాయం కారణంగా ముందుగా ఔట్ అయ్యాడని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు.
"I don’t want to say any emotional statements now, but I think for myself and the guys at the top, we should consider all possibilities."
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) February 26, 2025
- Jos Buttler pic.twitter.com/qGdcJjDCi4
"ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో జో రూట్ అద్భుతంగా రాణించాడు. సంక్షోభంలో ఎలా ఆడాలో జో రూట్ చూపించాడు. వన్డే క్రికెట్ లో రూట్ రికార్డు అద్భుతంగా ఉంది. నేను బాగా ఆడలేదని నాకు తెలుసు. నేను అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిని, నేను బాగా ఆడకపోవడం నిరాశపరిచింది. ఈ పరిస్థితిలో నేను ఎటువంటి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకూడదని అనుకుంటున్నాను" అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. తన పేలవమైన ఫామ్ తో విమర్శలను ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.. తన కెప్టెన్సీ గురించి ఎటువంటి భావోద్వేగ ప్రకటన చేయనని, కానీ అన్ని అవకాశాలు పట్టికలో ఉన్నాయని అన్నాడు.