Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జోస్ ది బాస్.. రికార్డుల పరంపర

 jos buttler records in ipl

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ ది బాస్.. జోస్ బట్లర్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ రీతిలో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ సీజన్లో తన మూడో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కేవలం 57బంతుల్లోనే జోస్ బట్లర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 65బంతుల్లో తొమ్మిది ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో 116పరుగులు చేశాడు.

బట్లర్ తన తొలి 11పరుగులు చేయడానికి 14బంతులు ఆడాడు. హాఫ్ సెంచరీ చేయడానికి 36బంతులు ఫేస్ చేశాడు. తర్వాత 50పరుగులు సాధించడానికి కేవలం 21బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా జోస్ బట్లర్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం

అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం

దేవదత్ పడిక్కల్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగిన జోస్ బట్లర్ తొలుత కొంచెం జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో 11ఓవర్లో 100పరుగులు భాగస్వామ్యాన్ని ఈ జోడి నమోదు చేసింది. వీరిద్దరూ కలిసి 155 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఇది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్ షిప్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు అజింక్యా రహానే, షేన్ వాట్సన్‌ 144పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఇవ్వగా.. ఆ రికార్డును పడిక్కల్, జోస్ బట్లర్ జోడి అధిగమించింది.

సెంచరీల రికార్డుల్లోనూ జోస్ బట్లర్ హవా..

సెంచరీల రికార్డుల్లోనూ జోస్ బట్లర్ హవా..

ఈ సీజన్లో బ్యాక్ టూ బ్యాక్ రెండు సెంచరీలు చేసిన బట్లర్.. మొత్తం ఈ సీజన్లో మూడు సెంచరీలు సాధించాడు. ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో 2016సీజన్లో విరాట్ కోహ్లీ (4సెంచరీలు)తో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో జోస్ బట్లర్ 4సెంచరీలతో షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో క్రిస్ గేల్ 6, విరాట్ కోహ్లీ 5సెంచరీలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డుకు బట్లర్ చేరువయ్యాడు. 2016 ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక రన్ స్కోరర్‌గా అయిన విరాట్ కోహ్లీ 16 మ్యాచుల్లో 973పరుగులు చేయగా.. ఆ రికార్డును ఛేదించేందుకు బట్లర్ కు పుష్కలమైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం బట్లర్ 492పరుగులు చేశాడు. ఇంకా రాజస్థాన్ 7లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఈ సీజన్లో మోస్ట్ రికార్డులు బట్లర్‌వే

ఈ సీజన్లో మోస్ట్ రికార్డులు బట్లర్‌వే

ఈ సీజన్లో ఇప్పటివరకు చాలా రికార్డులు బట్లర్ పేరిటే ఉన్నాయి. అత్యధిక పరుగుల జాబితాలో 491పరుగులతో బట్లర్ తొలిస్థానంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. అలాగే ఈ సీజన్ అత్యధిక స్కోరు 116పరుగులు చేశాడు. అలాగే ఇప్పటివరకు అత్యధిక సిక్సులు (32)కొట్టాడు. అత్యధిక ఫోర్లు (41), అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసింది కూడా బట్లరే మొత్తం 5సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక సిక్సర్లు

రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక సిక్సర్లు

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా బట్లర్ రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్ 2022సీజన్లో కేవలం 32సిక్సర్లు బాదాడు. బట్లర్ తర్వాత ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ జాబితాలో బట్లర్ తర్వా 2020లో సంజూ శాంసన్ 26, 2008లో యూసుఫ్ పఠాన్ 25, 2010లో యూసుఫ్ పఠాన్ 24, 2013లో షేన్ వాట్సన్ 22 ఉన్నారు.

Story first published: Friday, April 22, 2022, 23:32 [IST]
Other articles published on Apr 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+